Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరల పెంపునకు వ్యతిరేకంగా
- Aprail 2న దేశవ్యాప్త నిరసనలు
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ పిలుపు
న్యూఢిల్లీ : పెట్రో ధరల పెంపు వల్ల ప్రజలపై మోయలేని భారం పడుతోందని, తక్షణం ఆ భారాల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించాలని, ధరలను తగ్గించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఢిల్లీలో సమావేశమైన పార్టీ కేంద్ర కమిటీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన ఇలా పేర్కొంది.
భరించలేని భారం
గత ఆరు రోజుల్లో ఐదుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమన్నాయి. ఒక్కో లీటరుకు ఇప్పుడు రూ.3.75 అదనంగా భారం పడుతోంది. దీంతో పాటు వంటగ్యాస్, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల ధరలు కూడా పెరిగాయి. ఇది ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న అన్ని నిత్యావసరాల ధరలు. పెరుగుతున్న నిరు ద్యోగం, పేదరికం, ఆకలితో నానా అవస్థలు పడుతున్న ప్రజల జీవనోపాధిపై ఇది మోయలేని భారాన్ని మోపు తోంది. పెట్రోలియం ఉత్పత్తులపై భారీగా విధించిన సెస్ / సర్‌చార్జీలను తక్షణమే రద్దు చేయాలని, వాటి ద్వారా ఇప్పటికే కేంద్రం అసాధారణ స్థాయిలో ఆర్జిం చిన ఆదాయాన్ని వినియోగించి ధరలు తగ్గించి, ప్రజ లకు ఊరట కల్పించాలని సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ భరించలేని ధరల పెరుగు దలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 2న నిరసనలు చేపట్టాలని అన్ని పార్టీ శాఖలకు కేంద్రకమిటీ పిలుపునిచ్చింది.
'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం
1990వ దశకంలో కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు సాగించిన హంతక దాడులను సీపీఐ(ఎం) ఎప్పటికప్పుడు, నికరంగా ఖండిస్తూ వచ్చింది. 1989 డిసెంబర్లో ఉగ్రవాదుల మొదటి హంతక దాడికి గురైన వారిలో సీపీఐ(ఎం) నేత మహ్మద్ యూసఫ్ తరిగామి ఒకరు. కాశ్మీరీ పండిట్ల దుస్థితికి సంఘీభావం తెలుపుతూ, గతంలోను, ఆ తరువాత వారి సంక్షేమం, పునరాసానికి సంబంధించిన అంశాలను సీపీఐ (ఎం) చేపట్టింది. ఈ చిత్రంలో కాశ్మీరీ పండిట్ల వేదనను చిత్రీకరించి, మతపరమైన సమీకరణలను పెంచేందుకు దానిని ఉపయోగించుకోజూస్తున్నారు. ఇది అనివార్యంగా మైనారిటీలపై విద్వేషాలను రెచ్చగొట్టేందుకు, హింసను రెచ్చగొట్టేందుకు అంతిమంగా ఇది దారి తీస్తుంది. వాతావరణానికి దారితీస్తుంది. ఇది భారతదేశ సమైక్యత, సమగ్రత, ప్రజల సంక్షేమం కోసం ఉద్దేశించినట్టిది కాదు. ఇప్పటికే తీవ్రంగా ఉన్న మత విభజనను మరింత దిగజార్చుతుంది. ఉగ్రవాదంపై పోరాటం భారతీయులందరి ఐక్య పోరాటమని కేంద్ర కమిటీ పునరుద్ఘాటించింది. ఉగ్రవాద శక్తుల అకృత్యాలకు అన్ని వర్గాలవారు నష్టపోయారు. ఉగ్రవాద హింసకు వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటం అందరినీ కలుపుకుపోయేలా ఉండాలే తప్ప చీలిక తెచ్చేలా ఉండకూడదు.
పశ్చిమ బెంగాల్ : ప్రయివేట్ బొగ్గు గనుల ప్రతిపాదనను రద్దు చేయండి
ప్రయివేట్ ఓపెన్ కాస్ట్ బొగ్గు గని కోసం బీర్భుం జిల్లాకు చెందిన డియోచా పచ్చమైలో అధిక సంఖ్యలో వున్న గిరిజనులతో సహా స్థానిక తెగల వారిని అక్కడి నుంచి తరిమేయాలని టీఎంసీ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అంతకుముందు, ఈ ప్రాజెక్ట్ ఆచరణ సాధ్యం కాదని కోల్ ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. ఇది ఉపాధి పరంగా కానీ, ఆ ప్రాంత అభివృద్ధికి కానీ ఏ విధంగాను తోడ్పడదు. అంతేకాదు, ఇది పర్యావరణంతోపాటు ఇక్కడి నివానప్రాంతాలను నాశనం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రణాళికకు వ్యతిరేకంగా పెద్దయెత్తున ఐక్య ఉద్యమాలు తలెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టును రద్దు చేయాల్సిందేనని ప్రజాతంత్ర శక్తులన్నీ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి.
కిరాతకమైన బీర్భుం హత్యలను ఖండించండి
అక్రమ ఇసుక తవ్వకాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారి మధ్య అపవిత్ర పొత్తు స్థానిక టీఎంసీ నాయకత్వం కింద ఒక మాఫియాగా ఏర్పడింది. వీరికి దన్నుగా పోలీస్ యంత్రాంగం నిలిచింది. రాంపూర్హట్ బ్లాక్‌లోని బొగ్తురు గ్రామంలో చోటుచేసుకున్న అత్యంత కిరాతక ఘటన దీనిని బయటపెట్టింది. పలు గుడిసెలను తగులబెట్టిన ఈ దారుణ సంఘటనలో పది మంది కాలినగాయాలతో చనిపోయారు. వీరిలో మహిళలు, పిల్లలే అధికం. పంచాయతీకి చెందిన స్థానిక టీఎంసీ ఉప సర్పంచ్ మృతికి ప్రతీకారంగా ఈ మూకలు హంతక దాడులకు దిగాయి. దీంతో తృణమూల్ కాంగ్రెస్‌కు పూర్తి ప్రమేయం ఉంది. పోలీసులు మాత్రం దీనిని వేరే కోణం నుంచి చూస్తున్నారు.
అనీస్ ఖాన్ హత్య కేసు: న్యాయం చేయండి
హౌరా జిల్లాలోని అమ్తా బ్లాక్‌లోని శారదా గ్రామంలో అలియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి కార్యకర్త అనీస్ ఖాన్‌ను పోలీసులు హత్య చేయడాన్ని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ఖండించింది. నేరస్థులను త్వరితగతిన పట్టుకుని కఠినంగా శిక్షించడం ద్వారా సత్వరమే న్యాయం చేకూరేలా చూడాలని డిమాండ్ చేసింది.
సీపీఐ (ఎం) 23వ అఖిల భారత మహాసభలు
ఏప్రిల్ 6 నుంచి 10 వరకు కేరళలోని కన్నూర్‌లో జరిగే 23వ పార్టీ అఖిల భారత మహాసభ ముందుంచనున్న ముసాయిదా రాజకీయ నిర్మాణ నివేదికను కేంద్ర కమిటీ ఆమోదించింది.