Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక సంఘాల సమ్మెకు మద్దతు
- గాంధీ విగ్రహం వద్ద ఆందోళన
- పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ మార్చ్
న్యూఢిల్లీ : కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మెకు మద్దతుగా పార్లమెంట్ వామపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. రాజ్యసభలో కార్మిక డిమాండ్లు చర్చించాలని డిమాండ్ చేసిన వామపక్ష ఎంపీలు, అందుకు చైర్మెన్ ససేమీరా అనడంతో వాకౌట్ చేశారు. అలాగే పార్లమెంట్ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. కార్మిక డిమాండ్లతో కూడిన ప్లకార్డు పట్టుకొని నినాదాలు చేశారు. అలాగే పార్లమెంట్ నుంచి విజరు చౌక్‌కు మార్చ్ నిర్వహించారు. కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె, పెట్రోల్ ధరలు పెరుగుదలపై చర్చించాలని రూల్ 267 కింద సీపీఐ(ఎం) ఎంపీలు బికాష్ రంజన్ భట్టాచార్య, వి.శివదాసన్, ఎంపీ ఎం.షణ్ముగమ్, సీపీఐ ఎంపీ బినరు విశ్వం, బీఎస్పీ ఎంపీ అశోక్ సిద్ధార్థ, డీఎంకే నేత తిరుచ్చి శివ, టీఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్ నోటీసులు ఇచ్చారు. అయితే చైర్మెన్ ఎం.వెంకయ్యనాయుడు వాటిని తిరస్కరించారు. జీరో అవర్‌లో ఆయా అంశాలను సభ్యులు లేవనెత్తొచ్చని అన్నారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు తమ స్థానాల్లో లేచి చర్చకు పట్టుపట్టారు. తాను అనుమతించనని చైర్మన్ తెలపటంతో సీపీఐ(ఎం), సీపీఐతో పాటు కొన్ని ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. దీంతో వెంటనే సభను మద్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. దీంతో సభ ప్రారంభమైన ఆరు నిమిషాలకే వాయిదా పడింది.
ఇటు లోక్‌సభలో కూడా కార్మిక సంఘాల సార్వ త్రిక సమ్మె, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు తమ స్థానాల్లోంచి లేచి చర్చకు పట్టుపట్టారు. అయితే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు అయిన తరువాత చూద్దామని పేర్కొ న్నారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గ లేదు. చర్చ చేపట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతిప క్షాల ఆందోళనల నడుమ స్పీకర్ ప్రశ్నోత్తరాలను నిర్వ హించారు. ప్రశ్నోత్తరాలు అయిన తరువాత అన్ని పార్టీల నేతలు మాట్లాడేందు కు అవకాశం ఇస్తాననీ, తరువాత ప్రభుత్వం, మంత్రి కూడా సమాధానం ఇస్తారని స్పీకర్ అన్నారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నినాదాల హౌరెత్తించారు. కార్మికుల సార్వత్రిక సమ్మె, ఇంధన ధరల పెరుగుదల వంటి వివిధ అంశాలపై చర్చ చేప ట్టాలని సీపీఐ(ఎం) ఎంపీ ఎఎం ఆరీఫ్, సీపీఐ ఎంపి ఎం.సెల్వరాజ్, కేరళ కాంగ్రెస్ (ఎం) ఎంపీ థామస్ చాజికదన్, ఆర్ఎస్పీ ఎంపీ ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్, టీఎంసీ ఎంపీ సౌగత్రారు, కాంగ్రెస్ ఎంపీలు అధిర్ రంజన్ చౌదరి, కె.మురళీధరన్, కె.సురేష్, టిఎన్ ప్రతాపన్, రమ్య హరిదాస్, ఎంకె రాఘవన్, బెన్నీ బెహనాన్, పిపి మహ్మద్ ఫైజల్, హిబి ఈడెన్, మాణి క్యం ఠాగూర్, ఐయూఎంఎల్ ఎంపీ ఈటి మహ్మద్ బషీర్, బీఎస్పీ ఎంపీ రితీష్ పాండేలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. అయితే స్పీకర్ ఓం బిర్లా వాటిని తిరస్కరించారు. ఆర్ఎస్పీ ఎంపీ ఎన్‌కె ప్రేమ్ చంద్రన్ మాట్లాడుతూ ''ఈ రోజు దేశంలోని అన్ని కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెను చేపడుతున్నాయి. లేబర్ కోడ్స్ రద్దు, పీఎఫ్, ఈఎస్ఐ సమీక్ష వంటి డిమాండ్లు వారు ముందుంచారు'' అని తెలిపారు.