Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్ 90పైసలు, డీజిల్ 77పైసలు పెంపు
న్యూఢిల్లీ: అంతర్జా తీయంగా తగ్గితే..ఇక్కడా తగ్గుతుంది, పెరిగితే.. ఇక్కడా పెరుగుతుంది.. అంటూ మోడీ సర్కార్ తీసుకొచ్చిన 'రోజువారీ ఇంధన ధరల నిర్ణయం' ఎంత ప్రమాదకరమో ఇప్పుడు అర్థమవుతోంది. పైసల్లో..మెల్ల మెల్లగా ధరల్ని పెంచుతూ కేంద్రం సామాన్యుల జేబు గుల్లచేస్తోంది. మంగళవారం లీటర్ పెట్రోల్‌పై 90పైసలు, లీటర్ డీజిల్‌పై 77పైసలు పెరిగింది. ఎన్నికల కోసం..ఓట్ల కోసం కొన్ని నెలలపాటు 'అంతర్జాతీయ మార్కెట్ ధరలు' మోడీ సర్కార్‌కు గుర్తుకు రాలేదు. మార్చి 22నుంచి ధరల పెంపు మొదలుపెట్టింది. గత 8 రోజుల్లో ఏడుసార్లు ఇంధన ధరల్ని పెంచింది. మంగళవారం నాటి పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.113.61, డీజిల్ రూ.99.84కు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో ఇంధన ధరలు రికార్డ్‌స్థాయికి చేరుకున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.100దాటింది. ముంబయిలో లీ.పెట్రోల్ రూ.115.04, డీజిల్ రూ.99.25కు, చెన్నైలో పెట్రోల్-రూ.105.94, డీజిల్ రూ.96, కోల్‌కతాలో పెట్రోల్- రూ109.68, డీజిల్-రూ.94.62కు చేరుకున్నాయి. ఇంధన ధరల పెంపుపై పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఎన్నికలు పూర్తయ్యాక, ఓట్ల అవసరం తీరాక..ఇలా ధరల పెంపునకు దిగటం ఏంటని ప్రశ్నించాయి. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్, ఔషధాలు, మందుల ధరల పెంపు...పేదలు, సామాన్యులపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.