Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి పనులు ప్రారంభించండి
- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరిన ఎంపీలు కోమటిరెడ్డి, కేశినేని నాని
న్యూఢిల్లీ: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ఆరు లైన్ల విస్తరించే పనులు త్వరగా ప్రారంభించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి,విజయవాడ ఎంపీ కేశినేని నానిలు కోరారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయ ం(ట్రాన్స్పోర్టు భవన్)లో ఆయనతో ఎంపీలు భేటీ అయ్యారు. ఎంపీలు, ఎన్హెచ్ఏఐ అధికారులు, జీఎంఆర్ సంస్థల ప్రతినిధులతో తన కార్యాలయంలో కేంద్ర మంత్రి సమీక్షించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్లు, మహానాడు రోడ్డు ఉంచి గన్నవరం విమానాశ్రయం వరకు మూడు ఫ్లైఓవర్ల నిర్మాణం, మునగచర్ల వద్ద అండర్ పాస్ నిర్మాణంతో పాటు అంపాపురంలోని మోడల్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్కు రూ. నాలుగు కోట్లు విడుదల, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని టోల్గేట్ల వద్ద విజయ డైయిరీ ఉత్పత్తుల విక్రయానికి అనుమతి ఇవ్వాలని కోరారు.