Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్
న్యూఢిల్లీ : ఓబీసీ జనాభా లెక్కించాలని కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ కోరుకోవడం లేదని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ సహాయం మంత్రి ప్రతిమా భౌమిక్ తెలిపారు. వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జనాభా గణన చట్టం-1948లో ఓబీసీ జనాభాను లెక్కించటంపై ఎటువంటి నిబంధన లేదని, అందువల్ల హౌం మంత్రిత్వ శాఖ కూడా ఓబీసీ జనాభాను లెక్కించాలని కోరలేదని తెలిపారు. ఓబీసీ లకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర జాబితాల్లో తేడా ఉండడం, సమగ్ర సమాచారం లేకపోవడంతో గణన క్లిష్టతతో కూడకున్నదని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా దేశంలో ఓబీసీ ల ఉపవర్గీకరణపై రోహిణీ కమిషన్ నివేదిక ఆలస్యం అయ్యిందని తెలిపారు. రోహిణీ కమిషన్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో ఓబీసీ ల ఉపవర్గీకరణపై సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ వారి నుండి దీన్ని ఎప్పుడు సాధిస్తారన్న విషయంపై నిర్ధిష్ట సమాచారం చెప్పలేదని తెలిపారు. ఈలోగా ఎలాంటి మధ్యంతర నివేదకను కమిషన్ నుండి కోరలేదని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి చెందిన కొన్ని విమానాశ్రయాలు, ప్రభుత్వ రంగ మేజర్ పోర్ట్ల్లో కొన్ని బెర్త్‌లు పబ్లిక్ ప్రయివేట్ పార్టనర్షిప్ (పీపీ) కింద రాయితీ ఒప్పందాల ద్వారా ప్రయివేట్ సంస్థలకు ఇచ్చామని కేంద్రం తెలిపింది.