Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 6 నుంచి సీపీఐ(ఎం) జాతీయ మహాసభలు
తిరువనంతపురం : ఏప్రిల్ 6 నుంచి 10 వరకు జరగనున్న సీపీఐ(ఎం) 23వ జాతీయ మహాసభలకు ఆతిథ్యమిస్తున్న సుందర రాష్ట్రం కేరళ సన్నద్ధమవుతున్నది. కన్నూర్‌లో ఈ మహాసభలు జరగనున్నాయి. ఎర్రజెండా రెపరెపలతో, బ్యానర్లతో రాష్ట్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కాగా, మార్చి 29న కయ్యూర్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఫ్లాగ్ డేను నిర్వహించారు. కన్నూర్‌లోని మహాసభల నిర్వహణ కార్యాలయం వద్ద సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్‌తో పాటు కేంద్ర కమిటీ సభ్యులు ఇపి జయరాజన్ కూడా ఈ జెండాను ఆవిష్కరించారు. తిరువనంతపురం ఏకేజీ సెంటర్ వద్ద సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అన్ని జిల్లాలు, స్థానిక, ప్రాంతీయ, శాఖ కేంద్రాల్లో ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. కన్నూర్‌లో పార్టీ సభ్యులు, మద్దతు దారులు సైతం తమ ఇండ్ల ముందు పార్టీ జెండాలను ఎగురవేశారు. కన్నూర్ జిల్లా కమిటీ కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి జెండాను ఎగురవేశారు.