Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బీసీ జనగణన చేపట్టాలని పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. లోక్సభలో నామా నాగేశ్వరరావు, రాజ్యసభలో కే.కేశవరావు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. అయితే వాటిని స్పీకర్ ఓంబిర్లా,రాజ్యసభ చైర్మెన్ ఎం.వెంకయ్యనాయుడు తిరస్కరించారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఉభయ సభల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. అనంతరం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. లోక్సభ పక్షనేత నామా నాగేశ్వరావు మాట్లాడుతూ పార్లమెంట్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు లెవనెత్తుతున్నామని తెలిపారు. 1931లో జరిగిన కుల గణననే చివరిదని అన్నారు. తెలంగాణలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపామని చెప్పారు. కేంద్రం బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఉందని, నిరుపేదలకు లబ్ది జరగాలంటే, కుల గణన జరగాలని స్పష్టం చేశారు. ఈ సమావేశాల్లో తొమ్మిది రోజులు పార్లమెంట్లో రైతుల కోసం మాట్లాడామని, రెండు రోజులు సభను స్తంభింపజేశామని తెలిపారు. ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్లకు ఏమయినా అర్ధమవుతుందా? ప్రశ్నించారు. పార్లమెంట్ వెల్లో కూర్చుని ఆందోళన చేశామని తెలిపారు.