Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. 'ద కాశ్మీర్ ఫైల్స్' సినిమానుద్దేశించి ఇటీవల కేజ్రీవాల్ వరుసగా వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ కార్యకర్తలు ఆయన ఇంటి ఎదుట నిరసనచేపట్టారు. విధ్వంసం సష్టించారు. గోడలపై పెయింటింగ్ పూశారు. అడ్డుకున్న పోలీసులతో గొడవకు దిగారు. కశ్మీర్ హిందువుల మారణహోమాన్ని కేజ్రీవాల్ అపహాస్యం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ అల్లర్లకు నేతృత్వం వహించిన బీజేపీ ఎంపీ తేజశ్వి శౌర్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ముఖ్యమంత్రి ఇంటికి బీజేపీ కార్యకర్తలు చేరుకునేందుకు ఢిల్లీ పోలీసులే కారణమంటూ ఆప్ నేతలు వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ నివాసం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలు, భద్రతా వలయాన్ని సంఘ విద్రోహ శక్తులు ధ్వంసం చేశాయని ఉప ముఖ్యమంత్రి మనీశ్ శిసోడియా తెలిపారు. ఢిల్లీ పోలీసుల సాయంతో బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారంటూ ట్వీట్ చేశారు. కాగా బీజేపీ కార్యకర్తల దాడులకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి నివాసం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న బీజేపీ కార్యకర్తలు.. ఆ పార్టీ జెండాలు చేతబూని.. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. అడ్డుకున్న పోలీసులతో ఘర్షణకు దిగారు. కొంత మంది భద్రతా వలయాన్ని దాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఆప్ ఏమన్నదంటే..
కశ్మీర్ పండిట్ల కష్టాలను పట్టించుకోని బీజేపీ కశ్మీర్ ఫైల్స్ సిని మాపై మాత్రం శ్రద్ధ చూపిస్తోందని ఆప్ ఇటీవల వ్యాఖ్యానించింది. కేంద్రంలో ఎనిమిదేండ్లుగా అధికారం ఉన్న కాషాయ పార్టీ కశ్మీర్ పండిట్లకు ఏం న్యాయం చేసిందో చెప్పాలని నిలదీసింది. బీజేపీ కేవలం కశ్మీర్ ఫైల్స్ సినిమా కోసం ఆందోళన చెందుతోందనీ, కశ్మీరీ పండిట్ల కోసం కాదని విమర్శించింది. సరైన డాక్యుమెంట్లు లేకపో యినా 223 మంది ఉపాధ్యాయులకు తమ పార్టీ శాశ్వత హోదా కల్పిం చిందనీ, వారి పెన్షన్ వ్యవస్థను క్రమబద్ధీకరించిందని తెలిపింది. ఢిల్లీ లోని కశ్మీరీ పండిట్లకు నెలకు రూ. 3000 అందిస్తున్నదని పేర్కొం ది. అయినా కశ్మీరీ పండిట్లకు కావాల్సింది సినిమా కాదని వారికి తగిన న్యాయం జరగాలని ఆప్ స్పష్టంచేసింది. ఈ సినిమాకు వినోదపన్ను మినహింపు ఇవ్వాలన్న బీజేపీ ఎమ్మేల్యేలు డిమాండ్ చేయడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనదైన శైలిలో స్పందించారు. అందరూ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా అయితే.. ఆ సినిమాను ఫ్రీగా చూడటానికి వీలుగా.. య్యూట్యూబ్‌లో అప్లోడ్ చేయొచ్చు కదా! అన్నారు. సినిమాపై వినోద రాయితీ ప్రకటించడం కంటే.. సినిమాను యూట్యూబ్‌లో పెట్టమని వివేక్ అగ్నిహోత్రికు సలహా ఇవ్వండనీ, ఒక్కరోజులో ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తారని తెలిపారు. ఎక్కడా పన్ను కట్టవాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ కామెంట్ చేశారు.