Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.47 లక్షల కోట్లకు చేరిక
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం విదేశీ అప్పుల్లో భారతదేశాన్ని ముంచి వేస్తుంది. గడిచిన ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో భారత విదేశీ అప్పులు 11.5 బిలియన్ డాలర్లు పెరిగి 614.9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.46.60 లక్షల కోట్ల)కు ఎగిశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒక్క త్రైమాసికంలోనే దాదాపు 11.5 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.87వేల కోట్ల అప్పులు పెరిగాయి. విదేశీ అప్పును సమగ్రంగా, జాగ్రత్తగా నిర్వహిస్తున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. అమెరికా సహా ఇతర ప్రధాన కరెన్సీల విలువ పెరగడం ద్వారా అప్పు పెరిగిందని తెలిపింది. డిసెంబర్ ముగింపు నాటికి వాణిజ్య అప్పుల వాటా 36.8 శాతానికి చేరింది. నాన్ రెసిడెంట్ డిపాజిట్లు 23.1 శాతంగా నమోదయ్యాయి. మొత్తం భారత అప్పుల్లో అమెరికా డాలర్ల వాటా 52 శాతంగా ఉంది. భారత రూపాయాలు 32 శాతం, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డిఆర్) 6.7 శాతం, యెన్ 5.3 శాతం, యూరో 3.1 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి.