Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్కేఎం తరఫున పురస్కారాన్ని అందుకున్న హన్నన్ మొల్లా
న్యూఢిల్లీ : చారిత్రాత్మక రైతు ఉద్యమానికి నాయకత్వం వహించినందుకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం)కు క్వైడ్ మిల్లెట్ ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ ట్రస్ట్ అవార్డును అందించింది. గురువారం చెన్నైలోని నుంగంబాక్కంలోని క్యూఎం కళాశాల ఆడిటోరియంలో జరిగిన సభలో ఈ అవార్డును అందజేశారు. ఎస్కేఎం తరఫున ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా అవార్డును అందుకున్నారు. దేశంలో నల్ల రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఎస్కేఎం చారిత్రాత్మక ఉద్యమాన్ని నడిపింది. మోడీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల, రైతు వ్యతిరేక విధానాన్ని ఓడించినందుకు ఎస్కేఎం రాజకీయ, ప్రజా నిజాయితీకి అవార్డును అందజేసింది. గొప్ప చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్కి ఈ అవార్డు అందజేశారు. ఇర్ఫాన్ హబీబ్ అవార్డు ద్వారా వచ్చిన నగదును ఎస్కేఎంకి అందజేశారు. దావూద్ మియాఖాన్ అవార్డులను అందజేశారు. ప్రముఖ పాత్రికేయులు ఎన్.రామ్ తదితరులు మాట్లాడారు.