Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు రాష్ట్రాల్లోని 357 శాఖల పర్యవేక్షణ
ముంబయి : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) హైదరాబాద్ కేంద్రంగా కొత్తగా నేషనల్ బ్యాంకింగ్ గ్రూపు (ఎన్బీజీ) సౌత్ 2 కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దీన్ని ఆ బ్యాంక్ ఎండీ, సీఈఓ ఎకె దాస్ ముంబయి నుంచి వర్చ్యూవల్గా ప్రారంభించారు. దీనికి ఆ బ్యాంక్ ఉన్నతాధికారులు ఎస్కె బెహెర, ఆర్డి తిపారి, ఎస్ మలయదాస్ హాజరయ్యారు. గురువారం నుంచి ఈ కొత్త కార్యాలయం నిర్వహణలోకి వచ్చిందని బీఓఐ తెలిపింది. ఎన్బీజీ సౌత్ 1 కార్యాలయం చెన్నరులో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లోని 357 శాఖలను ఎన్బిజి-సౌత్ 2 పర్యవేక్షించనుంది. దీంతో తమ వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు అందనున్నాయని పేర్కొంది.