Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్థాన్లో కాషాయ నేత కండకావరం
కోటా : రాజస్థాన్లో దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ ప్రభుత్వ అధికారిపై దాడి చేశారన్న ఆరోపణతో పాటు అతని విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నందుకు బీజేపీ మాజీ ఎమ్మెల్యే భవానీ సింగ్ రాజ్వత్ను పోలీసులు అరెస్టు చేశారు. కోటా జిల్లా అటవీ అధికారి రవి మీనా ఇచ్చిన ఫిర్యాదుతో భవానీ సింగ్ను అరెస్టు చేసి.. ఐపీఎస్లోని 332, 353 సెక్షన్లలతో పాటు.. ఎస్సీ, ఎస్టీ అఘాయిత్యాల నిరోధక చట్టంలోని సెక్షన్ 3 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఏరియా డీఎస్పీ కాలూరామ్ వర్మ తెలిపారు. నయాపురా పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. తన అధికార పరిధిలోని అటవీ ప్రాంతం గుండా ఓ ఆలయానికి వెళుతున్న రహదారి మరమ్మత్తుల విషయంలో భవానీ సింగ్ తనతో గొడవకు దిగారని జిల్లా అటవీ అధికారి ఫిర్యాదులో పేర్కొన్నారు.