Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకటించిన రష్యా
- మోడీ, జై శంకర్‌లతో రష్యా విదేశాంగ మంత్రి భేటీ !
- భారత్ స్వతంత్ర విదేశాంగ విధానానికి ప్రశంసలు
న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో రష్యా వ్యతిరేక వైఖరి తీసుకోవాలని భారత్‌పై అంతర్జాతీయంగా ఒత్తిళ్లు పెరుగుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్రోవ్తో శుక్రవారం భేటీ అయ్యారు. వీరి సమావేశం 40 నిముషాల పాటు సాగింది. గత రెండు వారాల్లో బ్రిటన్, చైనా, ఆస్ట్రియా, గ్రీస్, మెక్సికో దేశాల మంత్రులతో సహా ఎవరినీ మోడీ కలుసుకోలేదు.తాజాగా రష్యా మంత్రితోనే సమావేశమయ్యారు.పుతిన్ సందేశాన్ని వ్యక్తిగతంగా మోడీకి అందజేయాలనుకుంటున్నట్లు అంతకుముం దు లావ్రోవ్ తెలిపారు. ''పుతిన్, మోడీలు క్రమం తప్పకుండా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇక నా చర్చల గురించి పుతిన్‌కు తెలియజేయాల్సి వుంటుం ది.'' అని రష్యా విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించా రు.భారతదేశ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్రోవ్ ప్రశంసించారు. రష్యా నుండి ఏదైనా కొనుగోలు చేయాలని భారత్ భావిస్తే దానిపై చర్చకు సిద్ధంగా వున్నామని శుక్రవారం ఆయన తెలిపారు. ఉక్రెయిన్ సంక్షోభంపై భారతదేశ మధ్యవర్తిత్వంపై కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. భారత్ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో సమావేశానంతరం లావ్రోవ్ విలేకర్లతో మాట్లాడారు. భారత్, రష్యా మధ్య పరస్పరం ఆమోదయోగ్యమైన సహకారానికి తాము సంసిద్ధంగా వున్నామన్నారు. ఉక్రెయిన్ సంక్షోభంలో ప్రధాని నరేంద్ర మోడీ మధ్యవర్తిగా వుండే అవకాశాలను ప్రశ్నించగా ఆయన సానుకూలంగా స్పందించారు. ''భారత్ కీలకమైన దేశం. ఆషామాషీగా వ్యవహరించదు. భారత్ గనుక ఆ పాత్ర పోషిస్తే, దానివల్ల పరిష్కారం దొరికితే, భారత్ మా ఉమ్మడి భాగస్వామిగా వుంటుంది. ఉక్రెయిన్‌కు భద్రతాపరమైన హామీ ఇవ్వడానికి మేం సిద్ధంగా వున్నాం. పశ్చిమ దేశాలు ఆ బాధ్యతను విస్మరిస్తున్నాయి. అటువంటి మధ్యవర్తిత్వ క్రమానికి భారత్ తోడ్పాటునందించవచ్చు.'' అని వ్యాఖ్యానించారు. గురువారం సాయంత్రం లావ్రోవ్ భారత్ చేరుకున్నారు. రాయితీపై రష్యా చమురును పెద్ద మొత్తంలో భారత్ కొనుగోలు చేయగలదన్న సంకేతాల నడుమ ఇరువురు విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక వాణిజ్యానికి రూబుల్-రూపాయి చెల్లింపుల ఏర్పాటు చేసుకోవడంపై ఇరు పక్షాలు ఆసక్తి కనపరుస్తున్నాయి. కాగా, రష్యాపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో వాటిని ఉల్లంఘించడానికి, వక్రీకరించడానికి ప్రయత్నించే దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవని అంతకు కొద్దిగంటల ముందే అమెరికా డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు దలీప్ సింగ్ హెచ్చరించారు. రష్యా నుంచి భారత్ సత్వరమే ఇంధన, ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడాన్ని అమెరికా ఇష్టపడబోదని చెప్పారు. భారత అధికారులతో ఆయన పలు సమావేశాలు జరిపారు. యుద్ధానికి ముందు బారెల్ 35డాలర్లు చొప్పున రష్యా చమురును విక్రయించేందుకు ముందుకొచ్చిందని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. ఈ ఏడాదికి 15 మిలియన్ల బారెళ్ల చమురును తీసుకోవాలని రష్యా భావిస్తోందని తెలిపింది. చమురు ధరలు పెరుగుతున్నందున, తమ ఇంధన అవసరాల కోసం మంచి ఒప్పందాలకై ఎదురుచూస్తున్నామంటూ భారత్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ''మేం మరో రెండు మూడు మాసాలు వేచి వున్నట్లైతే రష్యా చమురు, గ్యాస్‌కు అతిపెద్ద కొనుగోలుదారులెవరో చూస్తాం. ఇప్పుడున్న జాబితాకు భిన్నంగా ఏమీ వుండదని భావిస్తున్నాం.'' అని జైశంకర్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో భారత్ తటస్థంగా వ్యవహరిస్తోంది. రష్యా చర్యను ఖండిస్తూ, ఐక్యరాజ్య సమితి వేదికగా జరిగిన తీర్మానాల ఓటింగ్‌లకు గైర్హాజరైంది.