Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సవరణ రేట్లను ఖండించిన కార్మికుల హక్కుల సంస్థలు
- మోడీ సర్కార్ తీరుపై ఆగ్రహం
- ఎన్ఎస్ఎం, పీఏఈజీ సంయుక్త ప్రకటన
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) ప్రకారం కార్మికులకు కేంద్రం ఇటీవల వేతన రేట్లను సవరించింది. ఎలాంటి చర్చకూ తావు లేకుండా కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభానికి మూడు రోజుల ముందే దీనిని నోటిఫై చేసింది. అయితే, మోడీ సర్కారు తీరుపై మాత్రం కార్మికుల హక్కుల సంస్థల నుంచి మాత్రం వ్యతిరేకత వస్తున్నది. కేంద్రం ఉపాధి హామీ చట్టంపై దాడి చేస్తున్నదని ఆరోపించాయి. ఈ మేరకు కేంద్రం సవరించిన వేతన రేట్లను ఖండిస్తూ ఎన్ఆర్ఈజీఏ సంఘర్ష్ మోర్చా (ఎన్ఎస్ఎం), పీపుల్స్ యాక్షన్ ఫర్ ఎంప్లారుమెంట్ గ్యారెంటీ (పీఏఈజీ)లు సంయుక్త పత్రికా ప్రకటనను విడుదల చేశాయి.
2022 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్రం గతనెల 28న ఉపాధి వేతన రేట్లను సవరించింది. వేతన రేట్లలో మాత్రం స్వల్ప పెరుగుదల నమోదైంది. కానీ, ఈ పెరుగుదల మాత్రం వ్యవసాయ కనీస వేతనాల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. దీనిపై కార్మికుల హక్కుల సంస్థలు కేంద్రం తీరును ప్రశ్నిస్తున్నాయి.
వివాదాస్పద అంశాలు
ఉపాధి హామీ విషయంలో కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదంగా ఉన్నాయి. వీటిలో.. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి కేవలం మూడు రోజుల ముందే వేతన రేట్లను కేంద్రం నోటిఫై చేసింది. దీంతో ఈ అంశంపై చర్చకు ఎలాంటి సమయానికి కూడా తావివ్వలేదు. ఎంజీఆర్ఈజీఏపై కేంద్రం దాడి కొనసాగుతున్నదని కార్మికుల హక్కుల సంస్థలు పేర్కొన్నాయి. కార్మికుల హక్కుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించిందని వివరించాయి. ఇందుకు వేతన రేట్ల నోటిఫై విషయంలో ప్రభుత్వ జాప్యమే నిదర్శనమని పేర్కొన్నాయి.వేతన రేటు పెరుగుదల రూ. 4 నుంచి 21 మధ్య ఉంటుందనీ, ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరం, త్రిపుర లలో ఎలాంటి పెరుగుదల నమోదు కాలేదని ఆందోళన వ్యక్తం చేశాయి. దేశవ్యాప్తంగా వేతన రేట్లలో సగటు పెరుగుదల 4.25 శాతం మాత్రమే. ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణంపై భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అంచనా కంటే కూడా తక్కువగా ఉన్నది. ఎంజీఎన్ఆర్ఈజీఏ వేతన రేటు రెండు రాష్ట్రాలలో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ కనీస వేతనం కంటే తక్కువగా ఉన్నదని కార్మిక సంస్థలు పేర్కొన్నాయి.2014లో ప్రభుత్వం నియమించిన మహేంద్ర దేవ్ కమిటీ ఎంజీఎన్ఆర్ఈజీఏ వేతనాలను రాష్ట్రాల్లో కనీస వేతనాలతో అనుసంధానం చేయాలని కార్మిక హక్కుల సంస్థలు వివరించాయి. కనీసవేతనాలు ప్రాథమిక హక్కు అనీ, కార్మికుడికి తక్కువగా చెల్లించడం బలవంతపు పనికి సమానమని సుప్రీంకోర్టు తెలిపింది. ఇలాంటి సిఫారసులు, సుప్రీంకోర్టు ఆదేశాలున్నప్పటికీ గత కొన్నేండ్లుగా ఎన్ఆర్ఈజీఏ వేతన రేట్లలో స్వల్ప పెరుగుదల ద్రవ్యోల్బణం, జీవన వ్యయ పెరుగుదలకు అనుగుణంగా లేదని ప్రకటనలో పేర్కొన్నాయి.కరోనా మహమ్మారి, లాక్డౌన్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో కార్మికులను ఈ పథకం ఆదుకున్నదని గుర్తు చేశాయి. కానీ, కేంద్రం మాత్రం దీనిపై చిన్న చూపు చూస్తున్నదని ఆందోళనను వ్యక్తం చేశాయి. ఈ పథకాన్ని పక్కదారి పట్టిస్తున్నదని వివరించాయి. 2022 కేంద్ర బడ్జెట్లో స్వల్ప కేటాయింపులతో, ఇప్పుడు స్వల్ప వేతన రేటు సవరణలతో కార్మికులఓపికను మోడీ సర్కారు పరీక్షిస్తున్నదని అసంతృప్తిని వ్యక్తం చేశాయి..