Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘాలు పిలుపు
న్యూఢిల్లీ : ఉపాధి హామీ వేతనాలు పెంచాలని ఏప్రిల్ 21న దేశవ్యాప్త ఆందోళనకు వ్యవసాయ కార్మిక సంఘాలు పిలుపు ఇచ్చాయి. ఈ మేరకు ఢిల్లీల్లో వ్యవసాయ కార్మిక సంఘాలు ఎఐఏడబ్ల్యూయూ, బీకేఎంయూ, ఎఐఎస్కేఎస్, ఎఐఎఆర్ఎల్ఎ, ఎఐఏకేఎస్యూ సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు బి.వెంకట్(ఎఐఏడబ్ల్యూయూ),గుల్జార్ సింగ్ గోరియా (బీకేఎం యూ),అసిత్ గంగూలీ (ఎఐఎస్కేఎస్),థిరేంద్ర ఝా (ఎఐఎఆర్ఎల్ఎ), దర్మేందర్ (ఎఐఏకేఎస్యూ)లు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. ఉపాధి హామీ చట్టం కార్మికులకు రోజువారీ వేతనాల పెంచాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖను డిమాండ్ చేశారు. 34రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 24 రాష్ట్రాల్లో ఐదు శాతం కంటే తక్కువ వేతనాలు పెరిగాయని తెలిపారు. రోజుకు రూ.4నుంచి రూ.21 వరకు పెరిగాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల గ్రామీణ ప్రజల కష్టాలను పెరిగా యని, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల తట్టుకోలేకపోతున్నాయ ని పేర్కొన్నారు. ఉపాధి హామీపై కేంద్ర ప్రభుత్వం దాడి ప్రారంభించింద ని, రూ.98 వేల కోట్లు నుంచి రూ.73 వేల కోట్లుకు బడ్జెట్ను తగ్గించారని తెలిపారు. పని దినాలు తగ్గించారని విమర్శించారు. పెండిం గ్ వేతనాలు చెల్లించాలని, అలాగే ఉపాధి హామీ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపు ఇచ్చామని పేర్కొన్నారు.