Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్ హోం మంత్రి వ్యాఖ్య
అహ్మదాబాద్: దేశంలో లైంగికదాడులకు మొబైల్ ఫోన్లే కారణమని గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి ఆరోపించారు. మొబైల్ ఫోన్లోకి అశ్లీల వీడియోలు సులభంగా వచ్చేస్తున్నాయనీ.. ఇవి కొందరిలో దుర్బుద్ధిని రేపుతున్నాయని పేర్కొన్నారు.ఈ విషయాలు సర్వేలో వెల్లడైనట్టు ఆయన చెప్పారు. భారత్లో లైంగికదాడులు భారీగా పెరగడానికి ఇతర కారణాలూ లేకపోలేదన్నారు. 'సమాజానికి లైంగికదాడులు మాయని మచ్చగా నిలుస్తాయనీ, ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు శాంతి భద్రతలు సరిగా లేవని పోలీసులను నిందిస్తాం. కానీ ప్రతిసారి వారిని నిందించలేం. కుమార్తెపై ఓ తండ్రి దారుణానికి పాల్పడితే.. తప్పు పోలీసులది కాదు. ఇందుకు కారణం ఆ తండ్రి చేతిలోని సెల్ఫోన్' అని హోం మంత్రి పేర్కొన్నారు. అయితే తెలిసిన వ్యక్తులైన పొరుగిళ్లల్లో ఉండేవారు, కుటుంబ సభ్యులు సైతం ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని వివరించారు. అయితే ఈ తరహా ఘటనలో ముఖ్యంగా చిన్నపిల్లలపై జరుగుతున్నట్టు గుర్తించామని తెలిపారు.