Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్లీ పెరిగిన పెట్రో రేట్లు
- లీటర్ పెట్రోల్, డీజీల్‌పై
- 80 పైసలు చొప్పున పెంపు
న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్ ధరలు భగ్గుమంటు న్నాయి. పండుగ రోజూ కూడా బాదుడు తప్పలేదు. పెట్రో ధరలను శుక్రవారం ఒక్క రోజు గ్యాప్ తర్వాత మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజీల్‌లపై 80 పైసల చొప్పున ధరలు ఎగబాకాయి. దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో పెరిగిన ఇంధన ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.61గా, డీజీల్ రేటు రూ. 93.87గా ఉన్నది. దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో లీరట్ పెట్రోల్ ధర రూ. ఏకంగా రూ. 117.57కు ఎగబాకింది. ఇక్కడ డీజీల్ ధర రూ. 101.79కి చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ దర రూ. 108.21గా, డీజీల్ ధర రూ. 98.34గా నమోదైంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.19కి ఎగబాకగా, డీజీల్ ధర రూ. 97.02కి చేరింది. ఇక హైదరాబాద్‌లోనూ ఇంధన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్‌పై 91 పైసల మేర పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ. 116.33కు ఎగబాకింది. డీజీల్‌పై 87 పైసలు పెరిగి అది రూ. 102.45కి చేరింది.
12 రోజుల్లోనే రూ. 7.20 పెరుగుదల
భారత్‌లో గతనెల 22 నుంచి పెట్రోల్, డీజీల్ ధరల్లో పెరుగుదల కనిపిస్తున్నది. మొత్తం 12 రోజుల్లో 10 సార్లు ధరలు పెరిగాయి. దీంతో మొత్తం 12 రోజుల్లోనే పెట్రోల్ రేటు రూ. 7.20 మేర ఎగబాకింది.