Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా, అర్జు దేవ్బా దంపతులు ఆదివారం వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్తో కలిసి పూజలు నిర్వహించారు. అంతకుముందు కాలభైరవ్ ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు. శుక్రవారం మనదేశానికి వచ్చిన ఆయన శనివారం ప్రధాని నరేంద్ర మోడీని న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో కలిశారు. ఈ సందర్భంగా దేవ్బా, ఆయన బృందంతో మోడీ చర్చలు జరిపారు.