Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : సీపీఐ(ఎం) 23వ జాతీయ మహా సభల సందర్భంగా కేరళ మాజీ ముఖ్యమంత్రి ఇ.కె.నయనార్ మ్యూజియాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించారు. సీపీఐ(ఎం) ఆ రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయన్ మాట్లాడుతూ.. నయనార్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను, పోరాట గాథలను ఇక్కడ ఉంచినట్టు చెప్పారు. నయనార్ అకాడమీలో భాగంగా ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశామనీ, భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నయనార్ భార్య , పిల్లలు సుధా ఉష కృష్ణ కుమార్, వినోద్ కుమార్, అల్లుడు కెసి రవీంద్రన్ పాల్గొన్నారు. మ్యూజియంలో నయనార్ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.
సీపీఐ(ఎం) జాతీయ మహాసభలకు జాతీయ ప్రతినిధుల రాక మొదలు
కేరళలోని కన్నూర్‌లో ఈ నెల 6 నుంచి జరగనున్న సీపీఐ(ఎం) అఖిల భారత మహాసభలకు ప్రతినిధుల రాక ప్రారంభమైంది. సోమవారం ఉదయం గుజరాత్ ప్రతినిధులు కన్నూరుకు చేరుకున్నారు. రైల్వేస్టేషన్లో వారికి ఘన స్వాగతం లభించింది.