Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్చకు రాజ్యసభ చైర్మెన్ నిరాకరణ
న్యూఢిల్లీ : ప్రతిరోజూ పెరుగుతున్న పెట్రో ధరలతో జనం అల్లాడుతున్నా..మోడీ సర్కార్ కు మాత్రం బేఖాతర్ చేస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాక వరుసగా బాదేస్తోంది. సోమవారం కూడా పార్లమెంట్ కు పెట్రో సెగ తాకింది. మధ్యాహ్న భోజనానికి ముందు, ధరల పెరుగుదల అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు.దీంతో రాజ్యసభ కార్యకలాపాలు పలుసార్లు వాయిదా పడ్డాయి. విపక్ష సభ్యులు పెట్రో ధరలపై చర్చించాల్సిందేనంటూ పట్టుబట్టడంతో.. జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయం రద్దయింది.సభ ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే, ధరల పెరుగుదలపై చర్చ జరగాలని విపక్ష సభ్యులు నిలదీశారు. 267వ నిబంధన కింద ఇంధన ధరలు పెరగడంతోపాటు ఈ అంశంపై చర్చ జరగాలన్నారు.అంతకుముందు పలువురు విపక్ష సభ్యులు వాయిదా నోటీసులు ఇవ్వగా వాటిని చైర్మెన్ ఎం వెంకయ్యనాయుడు తిరస్కరించారు.ప్రశ్నోత్తరాల సమయాన్ని అనుమతించాలని సభ్యులు చేసిన విజ్ఞప్తిని పట్టించుకోలేదు. దీంతో కాంగ్రెస్, టీఎంసీ, లెఫ్ట్, ఆప్ ,డీఎంకే, మరికొన్ని పార్టీల.్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ధ రల పెరుగుదలపై చర్చ జరగాలని కోరుతున్నాం' అని నిరసన వ్యక్తం చేసిన సభ్యులు డిమాండ్ చేశారు.లిస్టెడ్ కాగితాలను సభ టేబుల్‌పై ఉంచిన వెంటనే, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ ధరలపై చర్చించాలంటూ..రూల్ 267 ప్రకారం నోటీసు ఇచ్చారు. వారిలో తిరుచ్చి శివ (డీఎంకే), బినోరు విశ్వం (సీపీఐ), అబిర్ రంజన్ బిస్వాస్ (టీఎంసీ), కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్) ఉన్నారు.267 ప్రకారం తనకు చాలా మంది సభ్యుల నుంచి నోటీసు వచ్చిందని నాయుడు చెప్పారు.ఆయన నోటీసులను అంగీకరించకపోవడంతో విపక్ష సభ్యులు నిరసనకు దిగారు.చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం బదిలీకి సంబంధించి పంజాబ్ విధానసభ ఆమోదించిన తీర్మానంపై చర్చించాలని దీపేందర్ ఎస్ హుడా (కాంగ్రెస్) కూడా నోటీసు ఇచ్చారని చైర్మెన్ తెలియజేశారు. ఈ నోటీసునూ సభాపతి అంగీకరించలేదు.
అంతకుముందు, బీజేపీకి చెందిన ఇద్దరు, కాంగ్రెస్‌కు చెందిన ఒకరు సహా కొత్తగా ఎన్నికైన ఆరుగురు రాజ్యసభ ఎంపీలు సోమవారం సభలో ప్రమాణం చేశారు.