Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రభుత్వ రంగంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) వచ్చే మే నెలలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రానుందని తెలుస్తోంది. ఇందులోని 7 శాతం వాటాలను విక్రయించడానికి ప్రభుత్వం చర్చలు జరుపుతుందని సమాచారం. ఈ ఇష్యూ విలువ రూ.50వేల కోట్లుగా ఉంటుం దని బ్లూమ్‌బర్గ్ మంగళవారం ఓ రిపోర్ట్‌లో తెలిపింది. ఐపీఓ కు సంబంధించి ప్రస్తుత ఆమోదాల గడువు మే 12 న ముగియనుంది. ఇంత లోపే వాటాలను ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి. దేశీయ ఐపీఓల్లో అతిపెద్దదిగా ఎల్ఐసీ నిలువనుంది. ఇప్పటి వరకు వచ్చిన వాటిలో 2021లో పేటియం రూ.18,300 కోట్లు, 2010లో కోల్ ఇండియా రూ.15,500 కోట్లు, 2008లో రిలయన్స్ పవర్ రూ.11,700 కోట్లుగా నమోదయ్యాయి. కాగా ఎల్ఐసీ ఎంబాడెడ్ (మిగులు విలువ)పై ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని సమాచారం.