Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చిలో నెమ్మదించిన తీరు
- పీఎంఐ రెండేండ్ల కనిష్టానికి
న్యూఢిల్లీ : భారత్లో మార్చిలో ఫ్యాక్టరీ కార్యకలాపాలు మందగించాయి. తయారీ కొనుగోలు మేనేజర్ల సూచిక (పీఎంఐ) రెండేండ్ల కనిష్టానికి చేరింది. పెరుగుతున్న ధరలు, కొత్త ఆర్డర్లు, అవుట్పుట్ సెప్టెంబర్ నుంచి బలహీన రేటుతో వృద్ధి చెందాయి. తాజాగా విడుదల చేసిన సర్వే ఇది రెండేండ్ల కనిష్టానికి చేరిందని వివరించింది. ఆసియాలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ రికవరీ మందగిస్తున్నదని సర్వే తాజా సాక్ష్యాలను అందిస్తున్నది. ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం చుట్టూ ఉన్న అనిశ్చితి కారణంగా చమురు ధరల పెంపుదల ఇప్పటికే వినియోగదారుల వ్యయంపై ప్రభావం చూపింది. ఫిబ్రవరిలో పీఎంఐ 54.9 నుంచి మార్చిలో 54కి క్షీణించింది. '' 2021-22 ఆర్థిక సంవత్సరం చివరిలో భారతదేశంలో తయారీ రంగం వృద్ధి బలహీనపడింది. కంపెనీలు కొత్త ఆర్డర్లు, ఉత్పత్తుల్లో స్వల్ప విస్తరణలను నివేదించాయి'' అని ఎస్ అండ్ పీ గ్లోబల్లో ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొలియానా డి లిమా వివరించారు.