Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : 'కేంద్రీకృత ప్రజా ఫిర్యాదులు, పరిష్కారం, పర్యవేక్షణా వ్యవస్థ' (సీపీజీఆర్ఏఎంఎస్)కు ఈ ఏడాది జనవరి-మార్చి మధ్యకాలంలో 13లక్షలకుపైగా ఫిర్యాదులు అందాయని పార్లమెంట్లో కేంద్రం వెల్లడించింది. లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సహాయ మంత్రి జితేంద్రా సింగ్ రాతపూర్వకంగా ఈ వివరాలు విడుదల చేశారు. దీని ప్రకారం, ఈ మూడు నెలల్లో మొత్తం 13,32,567 ఫిర్యాదులు అందాయి. ఇందులో 4,18,451 ఫిర్యాదులకు పరిష్కారం లభించిందని సంబంధిత మంత్రిత్వశాఖ తెలిపింది.