Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్ 90పైసలు, డీజిల్ 87పైసలు పెంపు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదల రికార్డ్‌స్థాయిలో కొనసాగుతోంది. హైదరాబాద్‌లో బుధ వారం లీటర్ పెట్రోల్ 90పైసలు, డీజిల్ 87పైసలు పెరిగాయి. ముంబయి లో లీ.పెట్రోల్ రూ.120 దాటింది. ఇంత భారీ స్థాయిలో పెట్రో ధరలు పెరుగుతున్నా.. అబ్బే ఇది చాలా తక్కువ, ఇతర దేశాలతో పోల్చుకుంటే మనదగ్గరే తక్కువ..అంటూ మోడీ సర్కార్ సమర్థించుకుంటోంది. మార్చి 22 నుంచి ఇంధన ధరల పెంపు..ఇది 14వసారి కావటం గమనార్హం. అంతేగాక..ఈ 16రోజుల్లో పెట్రోల్, డీజిల్‌పై రూ.10కు పైగా పెరగటం సామాన్యుల జేబు గుల్ల చేస్తోంది. హైదరాబాద్ సహా దేశంలో అనేక నగరాలు, పట్టణాల్లో లీ.పెట్రోల్ ధర రూ.120 దాటగా, డీజిల్ ధర ఎన్నడూలేనంతగా రూ.100దాటింది. హైదరాబాద్‌లో బుధవారం లీ.డీజిల్ ధర రూ.105.49కు చేరుకుంది. నిత్యం ఇంధన ధరల్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్యుడ్ని లూటీ చేస్తోందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.