Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా
- సందేశాలు పంపిన ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, సీపీఐ ఎంఎల్ లిబరేషన్
దేశంలో ఆర్ఎస్ఎస్ను సైద్ధాంతికంగా సవాల్ చేసి ఓడించగలిగేది వామపక్షలేనని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా స్పష్టం చేశారు. బుధవారం కేరళలోని కన్నూర్‌లో ఇకె నయనార్ నగర్లో సీపీఐ(ఎం) 23వ మహాసభ ప్రారంభం అయింది. ఈ సందర్భంగా సీపీఐ తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా సౌహర్థ్రి సందేశం ఇచ్చారు. వామపక్షాలు మాత్రమే ప్రత్యామ్నాయాన్ని అందించి, ఆర్ఎస్ఎస్ను ఓడించలగరని అన్నారు. మన పోరాటం సమాజంలోని అన్ని ప్రగతిశీల, లౌకిక, ప్రజాస్వామ్య శక్తులకు ద్వేషపూరిత సైద్ధాంతిక ప్రభావం నుంచి సమాజాన్ని ప్రక్షాళన చేయడానికి ఏకం కావడానికి ఒక వేదిక అవుతుందని తెలిపారు. ఇతర లౌకిక, ప్రజాతంత్ర, ప్రాంతీయ పార్టీల సహకారంతో వామపక్షాలు ఆ పాత్రను పోషించడానికి సన్నద్ధమయ్యాయని, అది మన చారిత్రక బాధ్యత అని మనం మరచిపోకూడదని అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని పునరేకీకరణ కావాలని సీపీఐ నిరంతరం చెబుతూ వస్తోందని అన్నారు. ఆర్ఎస్ఎస్కు మనం ప్రమాదకరమని నిరూపించుకోవడం మన ముందున్న సవాల్ అని పేర్కొన్నారు. సీపీఐ(ఎం) మహాసభ విజయవంతం కావాలని ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీలు సౌహర్థ్రి సందేశాలు పంపాయి. ఆర్ఎస్పీ ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య ప్రస్తుత సవాళ్లను అధిగమించేలా సీపీఐ(ఎం) అఖిల భారత మహాసభ జరాగాలని ఆకాంక్షిస్తున్నట్లు సందేశంలో తెలిపారు. ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి దేబాబ్రత బిశ్వాస్ దేశంలో వామపక్ష ఐక్యత తీర్మానాలు, చర్చలు జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపంకర్ భట్టాచార్య ఐక్య పోరాటం, విజయం కోసం పోరాటమని తెలిపారు. వామపక్ష ఐక్యతే తమ బలమని అన్నారు.