Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐ చర్యలపై అకార్ పటేల్
న్యూఢిల్లీ : సీబీఐ చర్యలను ఖండిస్తూ.. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చైర్మన్ అకార్ పటేల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ఢిల్లీ హైకోర్టుపై పూర్తి విశ్వాసం ఉందనీ, తనకు అమెరికా వెళ్లేందుకు అనుమతిస్తుందని భావిస్తున్నానని అన్నారు. మోడీ ప్రధాని పదవిని విమర్శనాత్మకంగా విశ్లేషిస్తూ.. ఇటీవల తాను రచించిన 'ది ప్రైస్ ఆఫ్ ది మోడీ ఇయర్స్' పుస్తకం కారణంగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను అడ్డుకున్నారని అన్నారు. 2021 నవంబర్ 14న ఆ పుస్తకం పబ్లిష్ అయిందనీ, ఆరువారాల అనంతరం డిసెంబర్ 31న సీబీఐ తనను లుక్ అవుట్ పరిధిలో చేర్చిందని అన్నారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థపై రెండేండ్ల క్రితం అంటే 2019లో సీబీఐ సోదాలు జరిపిందనీ, చివరిసారిగా 2020 నవంబర్లో తనను సీబీఐ విచారించిందని అన్నారు. బుధవారం జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. మోడీని విమర్శిస్తూ.. తాను రచించిన పుస్తకానికి ప్రతీకార చర్యగా అధికారులు తనను అమెరికా వెళ్లకుండా అడ్డుకున్నారని అన్నారు.
కోర్టు విచారణ సందర్భంగా లుక్ అవుట్ సర్క్యులర్లో తన పేరును చేర్చాలని సీబీఐకి ఎవరు సూచించారో చెప్పేందుకు అధికారులు నిరాకరించారని అన్నారు. ఇది సమిష్టిగా తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారని అన్నారు. తన పేరును చేర్చమని కోరిన వ్యక్తిని రక్షించేందుకు చేసిన యత్నమని అన్నారు. తాను కొనుగోలు చేసిన విమాన టికెట్ ధర రూ. 3.8 లక్షలను తప్పు చేసిన సీబీఐ అధికారి జీతం నుంచి మినహాయించాలని కోర్టును కోరినట్టు తెలిపారు. దర్యాప్తు సంస్థల్లోని అధికారులు స్వతంత్రంగా వ్యవహరించకుండా ఉండాలనే ఉద్దేశంతో తాను టికెట్ ఖర్చుల చెల్లించానని కోరానని అన్నారు. జర్నలిస్టులపై కేంద్రం, బీజేపీ పాలిత ప్రాంతాలు చేపడుతున్న చర్యలపై స్పందిస్తూ.. ప్రతి నిమిషం కూడా జర్నలిస్టులను ఎలా వేధించాలన్న అంశంపైనే వారు చర్చిస్తుంటారని అన్నారు. కేంద్రం నిరంకుశ చర్యలను ఎత్తిచూపే జర్నలిస్టులు, కార్యకర్తలు, ప్రతిపక్షాల గొంతుకను అణిచివేసేందుకు మోడీ ప్రభుత్వ ఇటువంటి చర్యలు చేపడుతోందని మండిపడ్డారు.