Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 40 దేశాల నుంచి సౌహార్ద సందేశాలు
కన్నూరు (కేరళ) నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
కేరళలోని కన్నూరులో కొనసాగుతున్న సీపీఐ (ఎం) 23వ అఖిల భారత మహాసభ... గురువారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. ఈనెల 10 వరకూ మహాసభ కొనసాగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొత్తం 40 దేశాల నుంచి వివిధ కమ్యూనిస్టు, వర్కర్స్ పార్టీలు అభినందనలు తెలుపుతూ సందేశాలు పంపాయి. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ వియత్నాం, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ క్యూబా, వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా, లావో పీపుల్స్ రెవల్యూషనరీ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆస్ట్రే లియా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ బంగ్లాదేశ్, వర్కర్స్ పార్టీ ఆఫ్ బంగ్లాదేశ్, వర్కర్స్ పార్టీ ఆఫ్ బెల్జియం, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ బొహేమియా అండ్ మొరే వియా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ బ్రెజిల్, కమ్యూ నిస్టు పార్టీ ఆఫ్ బ్రిటన్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ బర్మా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చిలీ, ఏకేఈఎల్ ఆఫ్ సైప్రస్, గెలిజన్ పీపుల్స్ యూనియన్, జర్మన్ కమ్యూనిస్టు పార్టీ, డై లింకే జర్మనీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ గ్రీస్, ఫ్రెంచ్ కమ్యూనిస్టు పార్టీ, టుథే పార్టీ ఆఫ్ ఇరాన్, ఇరాకీ కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఐర్ల్యాండ్, వర్కర్స్ పార్టీ ఆఫ్ ఐర్ల్యాండ్, ఇటాలియన్ కమ్యూనిస్టు పార్టీ, జపనీస్ కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎమ్ఎల్), కమ్యూనిస్టు పార్టీ నేపాల్ (యునైటెడ్ సోషలిస్టు), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ పాకిస్తాన్, పాలస్తీనియన్ కమ్యూనిస్టు పార్టీ, పోర్చుగీస్ కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్టు పార్టీ రష్యన్ ఫెడరేషన్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ద పీపుల్స్ ఆఫ్ స్పెయిన్ (పీసీపీఈ), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ శ్రీలంక, పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ (జేవీపీ) శ్రీలంక, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ స్వాజి ల్యాండ్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ టర్కీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ యూఎస్ఏ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ వెనిజులా, సౌత్ ఆఫ్రికన్ కమ్యూనిస్టు పార్టీ సందేశాలను పంపాయి.