Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేధింపుల కోసమే.. : ఎన్సీ విమర్శ
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (జేకేెఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) గురువారం విచారించింది. జమ్ముకాశ్మీర్ బ్యాంక్ స్కామ్‌కు సంబంధించి న్యూఢిల్లీలోని తన కార్యాలయానికి రావాలని ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసింది. దీంతో, ఆయన హాజరవగా, విచారణ జరిపింది. మోడీ ప్రభుత్వానికి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం హాబీగా మారిందని, రాజకీయ ప్రయోజనాల కోసం బిజెపిని వ్యతిరేకించే పార్టీలపై కేంద్ర సంస్థలతో దాడులు చేయిస్తున్నారని జేకేెఎన్సీ విమర్శించింది. ఒమర్ అబ్దుల్లా ఎటువంటి తప్పూు చేయలేదని, నిందితుడు కూడా కాదని, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తారని ఎన్‌సి తెలిపింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలువురిపై కేంద్ర సంస్థలను ప్రయోగిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్రలోని శివసేన ఎంపి సంజరు రౌత్, ఆయన భార్య ఆస్థులను ఇడి జప్తు చేసింది. అంతకుముందే మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను సీబీఐ అరెస్టు చేసింది.
బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదేవిధంగా వ్యవహరిస్తున్నాయి.ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన భోజిపూరా ఎమ్మెల్యే షాహ్జిల్ ఇస్లామ్‌కు బరేలీలో ఉన్న పెట్రోల్ బంక్ అక్రమమని ఆరోపిస్తూ యోగి ప్రభుత్వం బుల్డోజర్లతో గురువారం ధ్వంసం చేసింది.