Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళలో అత్యల్పం
న్యూఢిల్లీ : నాలుగు నుంచి తొమ్మిదేళ్ల వయసున్న చిన్నారుల మరణాలు అత్యధికంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా 2011 నుంచి 2019 వరకూ సేకరించిన సమాచారం ప్రకారం దేశం మొత్తం మీద నమోదవుతున్న మరణాల్లో ఈ రెండు రాష్ట్రాల్లోని 19 శాతం చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణాలు కోల్పోతున్న ప్రతి ఐదుగురు చిన్నారుల్లో మధ్యప్రదేశ్ నుంచి ఒకరుండగా, ప్రతి ఆరుగురిలో ఉత్తర ప్రదేశ్ నుంచి ఒకరు ఉంటున్నారు. కేరళలో చిన్నారుల మరణాలు అతి తక్కువగా ఉంటున్నారు. ప్రతి అరవైమందిలో ఒక చిన్నారి మాత్రమే కేరళకు చెందిన వారు. జాతీయ సగటు (ప్రతి తొమ్మిది మరణాల్లో ఒక చిన్నారి) కన్నా చాలా ఉత్తమం. నాలుగేళ్లలోపు చిన్నారుల మరణాల్లోనూ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నాయి. మొత్తం మరణాల్లో ఈ వయసు మరణాల శాతం మధ్యప్రదేశ్‌లో 9.1, ఉత్తరప్రదేశ్‌లో 8.2 శాతంగా ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో 80 ఏండ్లు దాటిన వృద్ధుల కంటే చిన్నారులు ఎక్కువగా మరణిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం మరణాల్లో చిన్నారుల మరణాలు 18.9 శాతం, 60 ఏళ్లు పైబడిన వారి మరణాలు 17.8 శాతం, 80 ఏళ్లు పైబడిన వారి మరణాలు 15.1 శాతం ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం మరణాల్లో చిన్నారుల మరణాలు 18 శాతం, అరవై ఏళ్లు దాటిన వారు 78.2 శాతం, 80 ఏళ్లు దాటిన వారు 15.4 శాతం ఉన్నారు. ఏడాది లోపు వయసున్న శిశువుల మరణాల విషయంలోనూ కేరళ చివరస్థానంలో ఉంది.
బీహార్, అస్సాంలో నవజాత శిశువుల మరణాల శాతం 17.14గా ఉన్నాయని నివేదిక తెలిపింది.