Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారంలో 9 రూపాయలకుపైగా పెంపు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సీఎన్జీ (కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్) ధరలూ పెరిగాయి. గురువారం కిలోగ్రామ్ సీఎన్జీపై రూ 2.75 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ఒక కిలోగ్రామ్ సీఎన్జీ రూ.71.75కు చేరుకుంది. సహజవాయువులో అత్యంత సమర్థవంతమైన, సురక్షితమైన ఇంధనంగా సీఎన్జీని వాహనాల్లో, వంటశాలల్లో, కొన్ని రకాల పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. కాలుష్య రహిత ఇంధనంగా వాహనాల్లో విరివిగా వాడటం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్‌లాంటి నగరాలు, చిన్న చిన్న పట్టణాల్లో సీఎన్జీతో నడిచే ఆటోలు పెద్ద సంఖ్యలో కనపడతాయి. వరుసగా సీఎన్జీ ధరల పెంపు..ఇప్పుడు ఆ వాహనాదార్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏప్రిల్ 1 నుంచి గత ఏడు రోజుల్లో సీఎన్జీ ప్రతి కిలోపై ధరలు రూ.9.10వరకు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ కిలో ధర రూ.69.11, నోయిడాలో రూ.71.67, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, గురుగ్రాంలలో రూ.77.44, ముంబయిలో రూ.67, గుజరాత్లో 76.98..గా నమోదయ్యాయి.