Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాటి నేటి ఉద్యమాల మణిహారం
- వేలాది మంది సందర్శకులతో ఎగ్జిబిషన్‌కు రద్దీ
- కండ్లకు కట్టినట్టు పోరాట చరిత్ర
- నాటి నేటి ఉద్యమాల మణిహారం
- వేలాది మంది సందర్శకులతో చారిత్రిక ఎగ్జిబిషన్ కిటకిట
కన్నూరు (కేరళ) నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
చారిత్రక పోరాటాలను ప్రతిబింబించే ఎగ్జిబిషన్ సందర్శకులతో కిటకిటలాడుతున్నది. వేలాది మంది సందర్శకులు నాటి పోరాటాలపై చర్చించుకుంటున్నారు. పోరాట చరిత్రను ఎగ్జిబిషన్ కండ్లకు కడుతున్నది. నాటి నేటి ఉద్యమాల మణిహారమే ఈ ఎగ్జిబిషన్. సీపీఐ(ఎం) 23వ అఖిల భారత మహాసభ సందర్భంగా కేరళలోని కన్నూర్ కె.వరదరాజన్ నగర్ (కలెక్టరేట్ గ్రౌండ్స్)లో చారిత్రాత్మక ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతున్నది. ఎగ్జిబిషన్‌లోకి ప్రవేశించగానే మహోన్నత కమ్యూనిస్టు నేత ఎకె గోపాలన్ విగ్రహం స్వాగతం పలుకుతున్నది. ఆ వెంటనే మార్క్సిస్టు మహోధ్యాయులు కారల్ మార్క్స్, లెనిన్, ఎంగిల్స్లు పలకరించే విధంగా ఏర్పాటుచేశారు. అక్కడ నుంచి దేశంగా జరిగిన చారిత్రిక ఘట్టాలు, స్వాతంత్ర పోరాటం, కమ్యూనిస్టు ఉద్యమ ఘట్టాలను వివరించేలా ఏర్పాటుచేసిన ఆర్స్ట్ గ్యాలరీలు సందర్శకులను ఆకట్టు కున్నాయి. వివిధ పోరాటాలను ప్రతిబిం బించే పెయింటిగ్స్ ఆలోచింప చేస్తున్నది. 1939లో తొలిసారి జరిగిన పినరయి పరప్రమ్ సమ్మేళనం ఘట్టాన్ని వివరించే విధంగా కళాఖండం వద్ద సందర్శకులు ఒకరితో ఒకరు చర్చించుకుంటున్నారు. స్వాతంత్ర పోరాట కథనాలను వివరించే కళారూపాలు సందర్శకులను ఆకట్టు కున్నాయి. నాటి చారిత్రాత్మక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, పశ్చిమ బెంగాల్ తెగాబా ఉద్యమం, మహారాష్ట్ర వర్లీ ఆదివాసీ పోరాటం, వున్నప్ర వాయిలార్ పోరాటం నుంచే నిన్న మొన్నటి చారిత్రాత్మక రైతు పోరాటం వరకు పోరాట దశలను వివరించే ఆర్ట్ గ్యాలరీ ప్రత్యేకంగా నిలిచింది. మహాత్మా గాంధీ విగ్రహంతో పాటు అనేక కమ్యూనిస్టు నేతల విగ్రహాలు ఎగ్జిబిషన్లో నిలిచాయి. కమ్యూనిస్టు చరిత్రను వివరించేందుకు రెండు మిని థియేటర్స్‌ను ఏర్పాటు చేశారు. సందర్శకులు నాటి పోరాటాలను చర్చించుకుంటున్నారు. అలాగే కయ్యూరు ఉద్యమాన్ని వివరించే కళారూపాలను చూసిన సందర్శకులు నాటి పోరాటాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమాలను వివరించే కళాఖండాలు ఎగ్జిబిషన్లో ప్రత్యేకంగా నిలిచాయి. వ్యాగన్ మారణకాండను కళ్లకు కట్టినట్టు వివరించారు. కేరళలోని కోజికోడ్‌లో థోల్వీరాక్ పోరాటం, కూథుపారమ్ పోరాటాలను వివరిస్తూ కళాఖండాలు ఆలోచింపజేశాయి. మహిళ రిజర్వేషన్, మహిళా పోరాట ఘట్టాలను వివరిస్తూ ప్రత్యేక మహిళ గ్యాలరీ ఏర్పాటు చేశారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శులు, ముఖ్యమంత్రుల చిత్రాలను ఎగ్జిబిషన్లో ఏర్పాటుచేశారు. భారతదేశ పోరాట చరిత్ర అణువణువు కళ్లకు కట్టినట్టు చూపించారు.
కేరళ చేనేత వస్త్రాలను ప్రదర్శించారు. కేరళ వంటకాలతో ఫుడ్ స్టాల్స్, ప్లానిటేషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి కళా ఖండం వద్ద సందర్శకులు ఛాయ చిత్రాలు తీసుకుంటూ సందడి చేశారు. కేరళలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన సందర్శకులు, రోజుకు దాదాపు ఐదు వేల మంది ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తున్నట్టు నిర్వహకులు తెలిపారు.
ఉట్టిపడేలా
కేరళ సంస్కృతి, సాంప్రదాయాల, ఉత్పత్తులు
కేరళ సంస్కృతి, సాంప్రదాయాలు, ఉత్ప త్తులు ఉట్టిపడేలా ఎగ్జిబిషన్ ఏర్పాటుచేశారు. ఈ ఎగ్జిబిషన్ పోలిస్ గ్రౌడ్స్‌లో ఏర్పాటుచేసింది. కేరళ ఉత్పత్తులు ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేశారు. ''కేరళ నెంబర్ 1'' పేరుతో ఏర్పాటు చేసి ఎగ్జిబిషన్లో రాష్ట్ర అభివృద్ధిని ప్రముఖంగా ప్రదర్శించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, అందిస్తున్న సేవలు వివరించే విధంగా స్టాల్స్ ఉన్నాయి. చేనేత మగ్గాలు, మట్టి పాత్రలు, పచ్చళ్లు, ఇతర కేరళ వంటకాలు ఏర్పాటు చేశారు. కేరళ ప్రభుత్వ విభాగాలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. విద్య రంగంపై ఏర్పాటు చేసిన స్టాల్ సందర్శకులను ఆకట్టుకుంది. అలాగే సిల్వర్ లైన్ ప్రాజెక్టు ప్రచారంలో భాగంగా భారీ త్రిడీ తెరను ఏర్పాటు చేశారు. కేరళ పోలీస్, టూరిజం, వైద్యం, వ్యవసాయం, పర్యాటకం వంటి ప్రభుత్వ విభాగాలు పెద్ద ఎత్తున స్టాల్స్ ఏర్పాటు చేశాయి. వివిధ రంగాలకు చెందిన దాదాపు మూడు వందల స్టాల్స్ ఏర్పాటు చేశారు.