Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మహాసభ తీర్మానం
పాలస్తీనాకు, పాలస్తీనా ప్రజలకు సీపీఐ(ఎం) 23వ అఖిల భారత మహాసభ సంఘీభావం తెలిపింది. ఈ మేరకు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు అరుణ్‌కుమార్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మరో కేంద్ర కమిటీ సభ్యులు ఎలమారం కరీం బలపరిచారు. సామ్రాజ్యవాదం, మతోన్మాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో పాలస్తీనా ప్రజలు భాగంగా ఉన్నారని తెలిపారు. పాలస్తీనా ప్రజలను అణచివేతకు గురిచేస్తున్న ఇజ్రాయిల్‌ను బహిష్కరించడంతో పాటు అన్నిరకాల బీడీఎస్ చర్యలను అమలు చేయాలని కోరారు. ఇజ్రాయిల్‌తో సైనిక, రక్షణ ఒప్పందాలన్నింటిని కేంద్ర ప్రభుత్వం తక్షణం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. 1967 నాటి సరిహద్దుల ప్రకారం తూర్పు జెరూసలెంను రాజధానిగా పాలస్థీనా దేశాన్ని తక్షణం ఏర్పాటుచేయాలని డిమాండ్‌చేశారు. 2018 మార్చి 30 నుంచి పాలస్తీనా ప్రజలు తమ మాతృభూమి కోసం ఆందోళనలు ప్రారంభించారని, రెండు సంవత్సరాలు కొనసాగిన తరువాత 2020లో కరోనా కారణంగా వాటిని వాయిదా వేశారని తీర్మానంలో తెలిపారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం తీరువాత జ్యూవిష్ జాతీయరాజ్యంగా పేర్కొంటూ ఇజ్రాయిల్ ప్రభుత్వం చట్టం చేసిందని, ఫలితంగా21 శాతంగా ఉన్న పాలస్తీనియన్లు అన్ని హక్కులను కోల్పోయారని తెలిపింది.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు మద్దతుగా, ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉన్నది. ఇలా జరగటం ఇదే మొదటిసారి. బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ ఆధునిక జియోనిజమ్తో తమకు సహజమైన స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఇజ్రాయిల్‌తో స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటున్నారుః అని తీర్మానంలో పేర్కొన్నారు.