Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మాజీ చీఫ్ ఆకార్ పటేల్‌ని మరోసారి ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఢిల్లీ కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ.. గురువారం రాత్రి బెంగళూరు విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు మరోసారి తనను విమానం ఎక్కకుండా అడ్డుకున్నారని అన్నారు. దీంతో సిబిఐపై శుక్రవారం కోర్టు ధిక్కార కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు మరోసారి అడ్డుకున్నారని, తనపై జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులను సిబిఐ ఉపసంహరించుకోలేదని అన్నారు. తమ ఫోన్‌కాల్స్‌కి సిబిఐ అధికారులు ఎవరు స్పందించలేదని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెప్పారని అన్నారు. 24/7 అందుబాటులో ఉండాల్సిన సిబిఐ... గౌరవనీయ న్యాయస్థానం ''వెంటనే'' అనే పదాన్ని ఉపయోగించినప్పటికీ... గురువారం రాత్రి పిటిషన్‌దారు విదేశాలకు వెళతారన్న విషయం తెలిసి ఉండి కూడా చట్టాన్ని అమలు చేయాల్సిన సంస్థ (సిబిఐ) గౌరవనీయ కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా నిద్రావస్థను ఎంచుకుందని కోర్టు ధిక్కార పిటిషన్లో పేర్కొన్నారు.
ఆదేశాలు ఉన్నప్పటికీ సిబిఐ అధికారి అందుబాటులో లేకపోవడం వలన గౌరవ న్యాయస్థానం ఇచ్చిన 7-4-22 నాటి ఉత్తర్వులను అమలు చేయకూడదని ప్రతివాది అయిన సిబిఐ ఉద్దేశపూర్వకంగా నిర్ణయించుకుందనడంలో ఎటువంటి సందేహం లేదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. లుక్ అవుట్ నోటీసుల్లో ఆకార్ పటేల్ పేరు చేర్చినందుకు సిబిఐ రాతపూర్వకంగా క్షమాపణలు చేప్పాలని, ఆయనపై జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్ని ''వెంటనే'' ఉపసంహరించుకోవాలని గురువారం ఢిల్లీ కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.