Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 నుంచి ప్రయివేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో...
న్యూఢిల్లీ : 10 నుంచి 18 ఏండ్లు దాటిన వారందరికీ ప్రయివేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో బూస్టర్ డోస్‌లు అందుబాట్లో ఉంటాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. పలు దేశాల్లో వైరస్ వ్యాప్తి పెరుగుతుండటం, మూడో డోసు తీసుకోని వారిని కొన్ని దేశాలు అనుమతించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. రెండో డోసు తీసుకుని తొమ్మిది నెలలు పూర్తయిన 18ఏండ్లు పైబడిన వారందరూ బూస్టర్ డోసు తీసుకునేందుకు అర్హులని పేర్కొంది. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న మొదటి, రెండో డోసుల పంపిణీ, ఆరోగ్య కార్యకర్తలు, 60ఏండ్లు పైబడిన వారికి అందించే బూస్టర్ డోస్ పంపిణీ కొనసాగుతుందని తెలిపింది. ఈ ఏడాది జనవరి 10 నుంచి ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60ఏండ్లు పైబడినవారితో పాటు ఇతర అనారోగ్య సమస్యలున్న వారికి బూస్టర్ డోస్ పంపిణీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దేశంలో 15 ఏండ్లు పైబడిన 96 శాతం మంది కనీసం ఒక డోసు తీసుకోగా, 83 శాతం మంది రెండు డోసులు తీసుకున్నట్టు ఆరోగ్య శాఖ తెలిపింది.