Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కన్నూరు : బెంగాల్‌కు చెందిన దీప్సితా దర్ ఎస్ఎఫ్ఐ జాతీయ కార్యదర్శి. డిల్లీలోని జేఎన్‌యూలో పరిశోధక విద్యార్థి. సీపీఐ(ఎం) మహాసభలకు తొలిసారిగా హాజరైన దీప్సిత .. మలయాళంలో పాట పాడి అందరి ప్రశంసలూ అందుకొంది. 'మేం పంటలు పండిస్తాం, ఆ పొలాలు మావే, అరుణారుణ పతాకం మాదే మాదే' అనే అర్థం వచ్చే మలయాళ గీతాన్ని అద్భు తంగా ఆలాపించగా, ప్రతినిధులు కరతాళధ్వనులు చేశారు. ఆ తరువాత దీప్సిత మాట్లాడుతూ... ''కేరళను నా ప్రియమైన భూమిగా భావిస్తాను. ఇక్కడి అలవాట్లు, సంస్కృతి నన్ను తనలో మమేకం చేసుకునే నేల ఇది.'' అని తెలిపింది. గల్ఫ్ వలసలపై తన పరిశోధన, ఉద్యమ అవసరాల నిమిత్తం ఇప్పటికే ఐదుసార్లు కేరళను సందర్శించింది. జేఎన్‌యూలోని తన కేరళ ఉద్యమ మిత్రుల ద్వారా మలయాళ అభ్యుదయ గీతాలను పాడటం నేర్చుకొంది. ఎస్ఎఫ్ఐ కార్యక్రమాల్లో తాను పాడిన 'ఆజాదీ', 'నమ్మాలు కోయుం వాయలెల్లం' పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీప్సిత గత అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని బాలి నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసింది.