Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్: ఇటీవల విడుదల వివాదాస్పద చిత్రం కాశ్మీర్ ఫైల్స్ ఎంతటి ప్రశంసలు అందుకుందో... అంతటి విమర్శలు ఎదుర్కొంది. 1990ల్లో ఉగ్ర దాడుల వల్ల హిందూ పండిట్లు వలస వెళ్లిపోయినట్టు చూపించిన ఈ చిత్రంపై విమర్శలు వెల్లువలా వచ్చాయి. ఒక కోణం నుండే చిత్రాన్ని చూపించారని రాజకీయ మేథావులు పేర్కొన్నారు. కాగా, ఇప్పుడు జమ్ముకాశ్మీర్ పోలీసులు 'ది అన్టోల్డ్ కాశ్మీర్ ఫైల్స్ (వెల్లడించని నిజాలు)' కింద వీడియోను రూపొందించి.. సోషల్ మీడియలో పోస్టు చేశారు. దీన్ని మార్చి 31న ట్విటర్లో పోస్ట్ చేయగా 1.67 లక్షల మందికిపైగా వీక్షించారు. ఆ సయమంలో కేవలం హిందువులే కాకుండా.. జమ్మూ-కాశ్మీర్లో మతాలతో సంబంధం లేకుండా అనేకమంది ఉగ్రదాడులకు బలయ్యారని అందులో పేర్కొన్నారు. శాంతిని కోరుకునే జమ్ముకాశ్మీర్లో 20వేల కాశ్మీర్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. 57 సెకన్ల ఈ వీడియోలో కాశ్మీర్లో చోటుచేసుకున్న పలు ఉగ్రదాడులకు సంబంధించిన దఅశ్యాలను పొందుపరిచారు. ప్రముఖ కవి ఫయజ్ అహ్మద్ ఫయజ్ రాసిన 'హమ్ దేఖేంగే' కవితను నేపథ్యంలో వినిపించారు. దీనికి వ్యతిరేకంగా గళమెత్తాల్సిన సమయం వచ్చిందని, ఈ దాడులను క్షమించలేం అని వీడియోలో పేర్కొన్నారు.