Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ మత గురువు అనుచిత వ్యాఖ్యలు
లక్నో : ముస్లిం మహిళలను కిడ్నాప్ చేసి, లైంగికదాడి చేస్తా అంటూ హిందూ మతగురువు ఒకరు చేసిన అనుచిత వ్యాఖ్యలు నెట్టింట్లో హల్చల్ చేయడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు విచారణను ప్రారంభించారు. ఈ ఘటన యూపీలోని సీతాపూర్ జిల్లాలో ఖైరాబాద్లో చోటుచేసుకుంది. ఓ మసీదు వెలుపల ఆయన ప్రసంగిస్తూ..ఈ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు వీడియోలో కనిపిస్తుంది. కాగా, ఆ వీడియోలో పోలీసులు కూడా ఉండటం గమనార్హం. కాషాయ వస్త్రాలు ధరించిన హిందూ సాధువు.. ఓ జీపులో కూర్చొని ఉండగా.. అక్కడ గుమిగూడిన జనాభా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మతగురువు మైక్రోఫోన్ తీసుకుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ ఏరియాలో యువతుల్ని, మహిళల్ని ఏ ముస్లిమైనా ఏడిపించినట్టు తెలిస్తే.. ముస్లిం మహిళలను కిడ్నాప్ చేసి.. బహిరంగంగా లైంగికదాడి చేస్తాను' అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోను ఆల్ట్ న్యూస్ అనే ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబీర్ వీడియోను షేర్ చేస్తూ.. ఈ నెల 2న ఈ వీడియోను చిత్రీకరించగా.. ఇప్పటి వరకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీతాపూర్ పోలీసులు.. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామనీ, వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, ఈ వీడియోలో ఉన్నది... భజరంజ్ మునీగా భావించిన కొందరు.. ఈ మత గురువుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.