Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని ఏటీఎంల్లో సదుపాయం
- అధిక పెట్రో ధరలతో ద్రవ్యోల్బణం.. : ఆర్బీఐ
ముంబయి : డెబిట్ కార్డ్ లేకుండానే అన్ని ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించుకునే సదుపాయం అందుబాటులోకి రానుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. బ్యాంక్లు తమ ఎటిఎం కేంద్రాల్లో ఈ సదుపాయాన్ని కల్పించేలా అనుమతులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఎస్బీఐ సహా కొన్ని బ్యాంక్లు మాత్రమే తమ సొంత ఏటీఎం కేంద్రాల్లో కార్డ్ రహిత చెల్లింపుల సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. యూపీఐ వ్యవస్థను ఉపయోగిస్తున్న అన్ని బ్యాంక్లు, ఏటీఎంలలో కార్డ్ లేకుండా నగదు ఉపసంహరణలకు అవకాశం కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. మూడు రోజుల పాటు సాగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష శుక్రవారం ముగిసింది. ఈ సందర్బంగా శక్తికాంత మీడియాతో మాట్లాడుతూ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించామన్నారు. రెపో రేటు 4 శాతంగానే ఉంటుందన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2022 -2023లో వృద్థి రేటు 7.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. గడిచిన 2021-22లో 8.9 శాతంగా ఉండొచ్చని విశ్లేషించామన్నారు.