Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇకె నయనార్ నగర్ నుంచి నవతెలంగాణ ప్రతినిధి
రాజకీయ తీర్మానాన్ని హర్షధ్వనాల మధ్య సీపీఐ(ఎం) 23వ మహాసభ ఆమోదించింది. రెండురోజుల పాటు ముసాయిదా రాజకీయ తీర్మానంపై జరిగిన చర్చలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. ఈ చర్చకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సమాధానమిచ్చారు. మహాసభకు ముందు, మహాసభలోనూ వచ్చిన సవరణలు, సూచనలు అధికభాగం తీర్మాన స్ఫూర్తిని బలపరిచేవని చెప్పారు. మహాసభ సందర్భంగా ప్రతినిధులు ఇచ్చిన సవరణల్లో ఆమోదించిన వాటి వివరాలను, మిగిలిన వాటి స్ఫూర్తిని తీసుకోవడం గురించి సవివరంగా తెలియచేశారు. తీర్మానాన్ని ఆమోదించాలని కోరారు. దీనిని అధ్యక్షవర్గం ఆమోదానికి పెట్టడంతో ప్రతినిధులు చేతులెత్తి ఆమోదాన్ని తెలియచేశారు. రాజకీయ తీర్మానం ఆమోదం పొందినట్టు హర్షధ్వనాల మధ్య అధ్యక్షవర్గం ప్రకటించింది.