Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వినతిపత్రంపై తొలి సంతకం చేసిన ఏచూరి
కన్నూరు (కేరళ) నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
విశాఖ స్టీల్‌ను ప్రయివేటీకరిం చడానికి వ్యతిరేకంగా సీపీఐ(ఎం) అఖిలభారత మహాసభలో శనివారం సంతకాల సేకరణ చేశారు. అంతకు ముందు సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మికవర్గం నేతృత్వంలో ఏడాదికి పైగా సాగుతున్న పోరాటాన్ని వివరించారు. అనంతరం విశాఖ ఉక్కును ప్రయివేటీకరించవద్దని కోరుతూ రూపొందించిన వినతిపత్రంపై ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తొలి సంతకం చేశారు. అనంతరం మహాసభ ప్రతినిధులు అందరూ సంతకాలు చేశారు. ఈ వినతిపత్రాన్ని ప్రధాని నరేంద్రమోడీకి పంపనున్నారు.