Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 94 మంది మహిళా ప్రతినిధులు
ఇకె నయనార్ నగర్ నుంచి నవతెలంగాణ ప్రతినిధి
సీపీఐ(ఎం) 23వ మహాసభకు ప్రతినిధులుగా 94 మంది మహిళలు హజరయ్యారు. మొత్తం ప్రతినిధుల్లోవీరిది12.89శాతం.పరిశీలకులుగా12 మంది హాజరుకాగా,వీరు 15.58 శాతంగా ఉన్నారు. ప్రతినిధులుగా పురుషులు 634 మంది పరిశీలకులుగా 62 మందిహాజరయ్యారు.30 సంవత్సరాలకన్నా తక్కువ వున్న వారు మొత్తం ప్రతినిధుల్లో 30 సంవత్సరాల వయసులోపు వారు ఏడుగురు, 30 నుంచి 39 సంవత్సరాల్లోపు వారు21మంది, 40నుంచి 49 సంవత్సరాల్లోపు వారు77మంది, 50నుంచి 59 సంవత్సరాల్లోపు వారు 217 మంది, 60 నుంచి 69 సంవత్సరాల్లోపు 290 మంది, 70 సంవత్సరాలు అంతకుపైనున్న వారు117 మంది ఉన్నారు. పరిశీలకుల్లో 30 సంవత్సరాల్లోపు వారు ఆరుగురు,30-39సంవత్సరాల్లోపువారు8మంది, 40-49 సంవత్సరాల్లోపు వారు 8మంది, 50నుండి 59 సంవత్సరాల్లోపు వారు22 మంది,60నుంచి 69 సంవత్పరాల్లోపు వారు24, 70 సంవత్సరాలు అంతకుపైబడిన వారు8 మంది ఉన్నారు.అత్యధిక వయస్సున్న ప్రతినిధిగా పి. మహమ్మద్ కుటి ్ట (90),అతి పిన్నవయసున్న ప్రతినిధిగాఆర్య రాజేంద్రన్ (23) నిలిచారు.పరిశీలకుల్లో అత్యధిక వయస్సున్న వారిగా గులాం క్వాధీర్భట్(88) అతిచిన్న వయసున్న వారిగా శైలేంద్రయాదవ్ (28) ఉన్నారు.
అత్యధిక జైలు జీవితం గడిపిన తరిగామి
మహాసభకు ప్రతినిధులుగా వచ్చిన వారిలో యూసఫ్ తరిగామి అత్యధికంగా6 సంవత్సరాల జైలు .జీవితం గడిపారు.5 నుంచి 10 సంవత్సరాల జైలు జీవితం గడిపిన వారు ప్రతినిధుల్లో ముగ్గురు ఉన్నారు.రెండు నుంచి ఐదు సంవత్సరాల జైలు జీవితం గడిపిన వారు12 మంది, ఒకటి నుంచి రెండు సంవత్సరాల జైలు జీవితం గడిపిన వారు21 మంది, ఆరు నెలల నుంచి ఒక్క సంవత్సరం జైలు జీవితం గడిపిన వారు 20 మంది ఉన్నారు. ప్రతినిధిగా హాజరైన కాంతి గంగూలి అత్యధికంగా8 సంవత్సరాల ఆరు నెలల కాలం అజ్ఞాత జీవితం గడిపారు.