Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందీ 'తప్పనిసరి' వద్దు
- ప్రభుత్వ చర్యను తప్పుబట్టిన అసోం సాహిత్య సభ
గువహతి : ఈశాన్య రాష్ట్రాల్లో హిందీ భాషపై రగడ కొనసాగుతున్నది. ఇక్కడ పదో తరగతి వరకు హిందీని తప్పనిసరి సబ్జెక్టుగా చేయడంపై వ్యతిరేకత వస్తున్నది. ప్రభుత్వ నిర్ణయాన్ని అసోం సాహిత్య సభ (ఏఎస్ఎస్) తప్పుబట్టింది. హిందీని తప్పనిసరి చేయడంపై విమర్శలు చేసింది. దీనికి బదులుగా ప్రభుత్వం స్థానిక భాషలను పరిరక్షించి ప్రమోట్ చేయడంపై దృష్టిని సారించాలని సూచించింది. దీనిపై ఏఎస్ఎస్ సెక్రెటరీ జనరల్ జాదవ్ చంద్ర ఒక ప్రకటనను విడుదల చేశారు. ఒకవైళ హిందీని తప్పనిసరి చేసినట్టయితే, స్థానిక భాషలు ప్రమాదంలో పడే అవకాశమున్నదని వివరించారు. అస్సామీని సీబీఎస్ఈ, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఎప్పటి నుంచో ఒత్తి చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ విషయంలో ఇప్పటి వరకూ ఎలాంటి పురోగతి లభించలేదన్నారు. ఏఎస్ఎస్ ఒక ప్రభావవంతమైన సాహిత్య సంస్థ. దీంతో ఏఎస్ఎస్ నుంచి వ్యతిరేకత ప్రభుత్వానికి సంకటంగా మారింది. అలాగే, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ప్రతిపక్షాలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. హిందీని తప్పనిసరిగా చేయడానికి ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు ఒప్పుకున్నాయని కేంద్రం చేసిన ప్రకటనను విమర్శించాయి. దీనిని సాంస్కృతిక సామ్రాజ్యవాదం వైపు అడుగుగా అభివర్ణించాయి.