Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజేఐ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ : దేశంలో ప్రత్యామ్నాయ వివాద పరి ష్కార (ఏడీఆర్) వ్యవస్థల అవసరాన్ని భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నొక్కి చెప్పారు. వీటిని కోర్టులు ప్రమోట్ చేయాలని కోరారు. ఏడీఆర్ల ఉప యోగం పెరగాలన్నారు. మధ్యవర్తిత్వం వంటి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థలు న్యాయ స్వరూపాన్ని మార్చగలవనీ, సుదీర్ఘమైన చట్టపరమైన చర్యలు లేకుండా లక్షలాది మందికి న్యాయాన్ని తీసుకొచ్చి ఫిర్యాదులను పరిష్కరించగలవని రమణ చెప్పారు. గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద మధ్యవర్తిత్వం, సమాచార సాంకేతికతపై నిర్వహించిన రెండు రోజుల ఆఖిల భారత సదుస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మధ్యవర్తిత్వం, దాని ప్రాముఖ్యత గురించి ఆయన నొక్కి చెప్పారు. కేసు నిర్వహణలో భాగంగా చర్చలు, మధ్యవర్తిత్వం తప్పనిసరి చేయడానికి న్యాయస్థానాల ద్వారా క్రియాశీల ప్రయత్నం జరగాలని తెలిపారు. మధ్యవర్తిత్వం అనేది పెండింగ్ కేసులను తగ్గించటంతో పాటు సమయాన్ని ఆదా చేయగలదని చెప్పారు. న్యాయశాస్త్రాన్ని అభ్యసించేవారు మధ్య వర్తిత్వం నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు.