Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మసీదుపై కాషాయ జెండా
- వీడియో వైరల్
పాట్నా : బీహార్‌లో శ్రీరామనవమి సందర్భంగా కాషాయ మూకలు రెచ్చిపోయాయి. ముజఫర్‌పూర్‌లో ఓ మసీదుపై కాషాయ జెండాను ఎగురవేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నది. కొందరు కాషాయ మూకలు శ్రీరామనవమి రోజున మోటార్‌సైకిల్స్‌పై ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ మొహమ్మద్పూర్ గ్రామంలోని డాక్ బంగ్లా మసీదు సమీపంలోకి చేరుకోగానే ఒక వ్యక్తి మసీదు మినార్ పై కాషాయ జెండాను ఎగురవేశాడు. పక్కనున్న వ్యక్తులు చప్పట్లు కొడుతూ అతన్ని అభినందిస్తున్న దశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైందని ముజఫర్‌పూర్ ఎస్ఎస్పీ జయంత్ కాంత్ మీడియాకు తెలిపారు. అయితే ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్లలో ఒకరిపై మరొకరు రాళ్లురువ్వుకున్నారు.