Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో నెలలోనూ పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఎగిసిపడుతున్నది. వంట నూనెలు, ఇంధన ధరలు ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్నాయి. ప్రస్తుత ఏడాది మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ ఏకంగా 6.95 శాతానికి ఎగిసిందని మంగళవారం కేంద్ర గణంకాల శాఖ వెల్లడించింది. గత 17 మాసాల్లో ఇదే అత్యధిక పెరుగుదల కావడం గమనార్హం. ముఖ్యంగా వంట నూనెలు, అహారోత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. దీంతో వరుసగా మూడో నెలలోనూ రిటైల్ ద్రవ్యోల్బణం ఎగిసింది. ఇంతక్రితం ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 6.07 శాతంగా చోటు చేసుకుంది. కేంద్ర గణంకాల శాఖ రిపోర్ట్ ప్రకారం.. 2022 మార్చిలో వంట నూనెల ధరలు ఏకంగా 18.79 శాతం, కూరగాయల ధరలు 11.64 శాతం చొపున పెరిగాయి. మాంసం, చేపల ధరలు 9.63 శాతం, పాదరక్షలు 9.4 శాతం, ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం 7.52 శాతంగా నమోదయ్యింది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 8.85 శాతం, ఉత్తర ప్రదేశ్, అస్సాంల్లో 8.19 శాతం ద్రవ్యోల్బణం నమోదు కాగా.. ఆ తర్వాత స్థానాల్లో మధ్య ప్రదేశ్ (7.89%), తెలంగాణ (7.66%), మహారాష్ట్ర (7.62%) రాష్ట్రాలు ఉన్నాయి. దేశంలో నమోదవుతున్న అధిక ధరలు ప్రభుత్వానికి, ఆర్బీఐకి సవాళ్లను విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్బీఐ ఎంపీసీ భేటీలో వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.