Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏబీవీపీ గూండాల దాడి ఘటనపై ఐషీఘోష్ డిమాండ్
- వీసీకి వినతి అందించేందుకు వెళ్తే అనుమతి నిరాకరణ
న్యూఢిల్లీ: జేఎన్ యూ లో విద్యార్థులపై ఏబీవీపీ గూండాల దాడిపై స్వతంత్ర న్యాయ విచారణ జరపాలని జేఎన్ యూఎస్ యూ అధ్యక్షురాలు ఐషీఘోష్ డిమాండ్ చేశారు. మంగళవారం జేఎన్యూ వీసీకి వినతి అందించేందుకు ఐషీఘోష్ తో పాటు జేఎన్ యూఎస్ యూ నేతలు, విద్యార్థులతో కూడిన మాస్ డెలిగేషన్ వెళ్తే అనుమతి నిరాకరించారు. దీంతో విద్యార్థులు తమ ఆందోళనను మంగళవారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా ఐషీఘోష్ మాట్లాడుతూ తమ న్యాయాన్ని అందించాలని, జేఎన్యూలో ఏబీవీపీ హింసకు ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పక్షపాత కథనాన్ని ప్రచారం చేసే పత్రికా ప్రకటనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సాయంత్రం యూనివర్సిటీ క్యాంపస్లో మానవహారం (హ్యూమన్ చైన్) చేపట్టారు. సబర్మతి నుంచి నార్త్ గేట్ వరకు జరిగిన మానవహారం లో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.