Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్రీయ విద్యాలయాల్లో పార్లమెంటు సభ్యుల (ఎంపీల) కోటా సీట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేక కోటా సీట్లపై కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రాష్ట్రాలకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ సర్క్యూలర్ జారీ చేసింది. కేంద్రీయ విద్యాలయాల్లో ఇకపై పార్లమెంటు సభ్యుల (ఎంపీల) కోటా కింద కేటాయించే ప్రత్యేక
సీట్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటివరకు ఒక్కో ఎంపీకి ఏటా 10 సీట్లను కేవీఎస్ కేటాయిస్తూ వస్తున్నది. అయితే, ఈ కోటా పెంచాలని గత కొంతకాలంగా ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు ఎంపీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ.. ప్రత్యేక కోటాను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పూర్తిగా రద్దు చేయడం గమనార్హం. లోక్సభ సభ్యులు 543 మంది, రాజ్యసభ సభ్యులు 245 మంది కలిసి ఏటా మొత్తం 7,880 మంది విద్యార్థులకు కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు ఇప్పిస్తున్నారు. ఎంపీల కోటాలో పారదర్శకత లోపిస్తోందనే విమర్శలు వినపడుతున్నాయి. దీంతో మొత్తం కోటానే రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.