Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌కు వెళ్లడానికి నిరాకరణ
న్యూఢిల్లీ : తనకు పర్మినెంట్ బెయిల్ మంజూరు చేయాలని, హైదరాబాద్ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని కవి, హక్కుల కార్యకర్త వరవరరావు కోరగా..బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఎల్గార్ పరిషద్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన గత ఏడాది ఫిబ్రవరి నుంచి తాత్కాలిక బెయిల్‌పై ముంబయిలో ఉండాల్సి వస్తోంది.
తన ఆర్థిక, ఆరోగ్య పరిస్థితుల దృష్టా ముంబయిలో ఉండలేనని, హైదరాబాద్‌కు వెళ్లేందుకు అనుమతి ఇస్తూ పర్మినెంట్ బెయిల్ మంజూరు చేయాల్సిందిగా బాంబే హైకోర్టును వరవరరావు కోరారు. వరవరరావు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, పార్కిన్సన్ లక్షణాలు కనపడుతున్నాయని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టుకు తెలియజేశారు. జస్టిస్ ఎస్.బి.శుక్రా, జస్టిస్ జి.ఎ.సనాప్లతో కూడిన ధర్మాసనం ఆయన విన్నపాన్ని తిరస్కరిస్తూ, ప్రస్తుతమున్న తాత్కాలిక బెయిల్‌ను మరో మూడు నెలలు పొడగించింది. ఎల్గార్ పరిషద్ కేసు విచారణ గడువు ముగిసిందని, ఇక నుంచి ఈకేసును ఎన్ఐఏ కోర్టు ప్రతి రోజూ విచారణ జరపాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.