Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : కర్నాటకలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసులో రాష్ట్ర గ్రామీణాభివద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెఎస్ ఈశ్వరప్పపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈశ్వరప్పతో పాటు ఆయన సన్నిహితులు బసవరాజ్, రమేష్‌లపై కూడా కేసు నమోదు చేశారు. దీనిపై కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ ' ఈశ్వరప్పపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అంతా సేకరిస్తున్నాను. ఈశ్వరప్పతో ఫోన్లో లేదా పిలిపించి మాట్లాడతాను' అని అన్నారు. ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు వార్తలు రావడంపై ముఖ్యమంత్రిని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఈశ్వరప్ప రాజీనామా గురించి తనకేమీ తెలియదన్నారు. ఈశ్వరప్ప తనతో నేరుగా మాట్లాడినప్పుడే ఈ అంశాలపై స్పష్టత వస్తుందని అన్నారు.
ఈశ్వరప్ప కమిషన్ ఇవ్వాలంటూ తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్ మంగళవారం ఉడిపిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నారు. రూ 2 కోట్ల బిల్లులో 40 శాతం కమీషన్ డిమాండ్ చేశారంటూ తన సూసైడ్‌లో లేఖలో పేర్కొన్నారు. ఈ మృతిపై సంతోష్ పాటిల్ సోదరుడు ప్రశాంత్ పాటిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరుడ్ని ఈశ్వరప్ప కమిషన్ ఇవ్వాలని వేధించాడని, లేకుంటే పరువు నష్టం కేసు వేస్తానని బెదిరించాడని, తనకు కూడా బెదిరింపులొస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు.