Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పశ్చిమబెంగాల్లో మహిళలకు భద్రత కరువు
- నిందితులు అధికార తృణమూల్ నాయకులు, కార్యకర్తలే..!
- సీఎం మమతా బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు.. సర్వత్రా వెల్లువెత్తిన ఆగ్రహ జ్వాలలు
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు దారుణంగా మారాయి. అక్కడ మహిళలు, బాలికలకు భద్రత కరువైంది. గత 40 రోజల్లోనే అక్కడ 15 లైంగికదాడి కేసులు నమోదు కావడమే రాష్ట్రంలోని పరిస్థితికి నిదర్శనం. నాలుగో తరగతి విద్యార్థిని నుంచి టీనేజీ బాలికల వరకు.. పని చేసుకునే మహిళల నుంచి గృహిణుల వరకు.. ఇలా ప్రతి ఒక్కరూ లైంగికదాడి బాధితులుగా ఉన్నారు. ఈ దారుణ ఘటనల్లో నిందితులు రాష్ట్రంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకులు, కార్యకర్తలే కావడం గమనార్హం.
ొ గతనెల 3 నుంచి రాష్ట్రంలో లైంగికదాడి కేసులు పెరిగాయి. దక్షిణ 24 పరగణాలు జిల్లాలో నాలుగో తరగతి బాలికపై టీఎంసీ కార్యకర్త లైంగికదాడికి తెగబడ్డాడు.
- మార్చి 22న బషిర్హాత్లో ఆదివాసీ మహిళపై టీఎంసీ కార్యకర్త తన పశువాంఛను తీర్చుకున్నాడు.
- మార్చి 24న అదే బషిర్హాత్లో 11 ఏండ్ల బాలికపై స్థానిక టీఎంసీ నాయకుడు దారుణానికి ఒడిగట్టాడు. అదేరోజు కేశ్పూర్లో హౌమ్ ట్యూటర్పై పోలీసు సిబ్బందే అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఈనెల 1న మాల్దా జిల్లాలో 14 ఏండ్ల బాలిక సామూహిక లైంగికదాడికి గురైంది. నిందితులిద్దరూ టీఎంసీ కార్యకర్తలే.
ొ ఏప్రిల్ 4న హన్స్ఖలీలో చోటు చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీఎంసీ నాయకుడి కొడుకు బర్త్డే వేడుకకు తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను పిలిచాడు. అనంతరం ఆమెపై లైంగికదాడి జరిపి కిరోసిన్ సహాయంతో బాధితురాలిని కాల్చి చంపాడు.